Hero Vida: హీరో ‘విడా’ స్కూటర్ల ధరలు తగ్గాయ్‌.. ఎంతంటే?

విడా స్కూటర్ల ధరలను రూ.20,000 వరకు తగ్గిస్తున్నట్లు హీరో మోటోకార్ప్‌ బుధవారం వెల్లడించింది. ఫలితంగా విడా వి1 ప్లస్‌ రూ.1,19,900, విడా వి1 ప్రో స్కూటర్‌ ధర రూ.1,39,900 (ఎక్స్‌-షోరూమ్‌)గా మారతాయి.

Updated : 04 May 2023 07:24 IST

దిల్లీ: విడా స్కూటర్ల ధరలను రూ.20,000 వరకు తగ్గిస్తున్నట్లు హీరో మోటోకార్ప్‌ బుధవారం వెల్లడించింది. ఫలితంగా విడా వి1 ప్లస్‌ రూ.1,19,900, విడా వి1 ప్రో స్కూటర్‌ ధర రూ.1,39,900 (ఎక్స్‌-షోరూమ్‌)గా మారతాయి. పోర్టబుల్‌ ఛార్జర్‌, ఫేమ్‌-2 రాయితీతో కలిపి ఈ కొత్త ధరలు అమల్లో ఉంటాయని తెలిపింది.  ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీల ఆధారంగా ధరల్లో మార్పులు ఉండొచ్చని కంపెనీ వెల్లడించింది. 2022 అక్టోబరులో విడా వి1 స్కూటర్లను హీరో మోటోకార్ప్‌ పరిచయం చేసి, డిసెంబరు నుంచే డెలివరీలు ప్రారంభించింది. ఇప్పటికే హైదరాబాద్‌, పుణె, అహ్మదాబాద్‌, నాగ్‌పుర్‌, నాసిక్‌, చెన్నై, కాలికట్‌, కోచి వంటి 8 నగరాల్లో విస్తరణ ప్రణాళికను ప్రారంభించింది. ఈ ఏడాది 100 నగరాలకు విస్తరిస్తామని హీరో మోటోకార్ప్‌ హెడ్‌-ఎమర్జింగ్‌ మొబిలిటీ బిజినెస్‌ యూనిట్‌ స్వదేశ్‌ శ్రీవాత్సవ వెల్లడించారు. బెంగళూరు, జయపుర, దిల్లీలోని 50 ప్రాంతాల్లో సుమారు 300 ఛార్జింగ్‌ పాయింట్లు కూడా ఉన్నట్లు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని