Luxury Houses - Hyderabad: విలాసవంతమైన ఫ్లాట్లకు గిరాకీ

జనవరి-మార్చి త్రైమాసికంలో విలాసవంత నివాస గృహాల అమ్మకాలు రాణించాయి. ప్రధాన 7 నగరాల్లో రూ.4 కోట్లు అంతకు మించి విలువైన  విలాస గృహాల విక్రయాలు దాదాపు 2.5 రెట్ల మేర పెరిగి

Updated : 09 May 2023 09:36 IST

7 ప్రధాన నగరాల్లో 2.5 రెట్ల విక్రయాలు
హైదరాబాద్‌లో 8 రెట్ల అమ్మకాలు
మార్చి త్రైమాసికంపై సీబీఆర్‌ఈ నివేదిక

దిల్లీ: జనవరి-మార్చి త్రైమాసికంలో విలాసవంత నివాస గృహాల అమ్మకాలు రాణించాయి. ప్రధాన 7 నగరాల్లో రూ.4 కోట్లు అంతకు మించి విలువైన  విలాస గృహాల విక్రయాలు దాదాపు 2.5 రెట్ల మేర పెరిగి 4,400కు చేరాయని స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ సీబీఆర్‌ఈ విడుదల చేసిన నివేదిక పేర్కొంది. ఏడాది కిందట ఈ విభాగంలో 1600 ఇళ్లు మాత్రమే అమ్ముడుపోయాయి. ఈ నివేదిక ప్రకారం..

* సమీక్షిస్తున్న త్రైమాసికంలో దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 1900 విలాస గృహాలు విక్రయమయ్యాయి. అంతక్రితం ఏడాది జనవరి-మార్చిలో అమ్ముడైన 600తో పోలిస్తే ఇవి మూడింతలకు పైమాటే.

* ముంబయిలో 800 నుంచి 1500కు; కోల్‌కతాలో 50 నుంచి 100కు; చెన్నైలో 50 నుంచి 250, పుణెలో 10 నుంచి 150కి అమ్మకాలు పెరగ్గా.. బెంగళూరులో పెద్దగా మార్పు లేకుండా 50 విలాస ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి.

* ఇక హైదరాబాద్‌లో 50 నుంచి 430కు అంటే 8 రెట్ల మేర విలాసవంత గృహాలు అమ్ముడయ్యాయి.

‘2022లోనూ బలమైన అమ్మకాలు కనిపించిన ఈ విభాగంలో అదే ధోరణి కొనసాగింది. కరోనా అనంతరం కొనుగోలుదార్ల ధోరణిలో మార్పు వచ్చింది. దీంతో మెరుగైన సదుపాయాలుండే విలాసవంతమైన ఇళ్ల వైపు దృష్టి సారించార’ని సీబీఆర్‌ఈ ఇండియా సీఈఓ అన్షుమాన్‌ మ్యాగజైన్‌ పేర్కొన్నారు. వచ్చే కొద్ది త్రైమాసికాల పాటు ఈ ధోరణి కొనసాగొచ్చని ఆయన అంచనా వేశారు. జనవరి-మార్చి 2023లో ఈ 7 నగరాల్లో మొత్తం 78,700 ఇళ్లు విక్రయమయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే సమయంలోనూ 70,500 గృహాలు అమ్ముడుపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు