Credit card: క్రెడిట్‌ కార్డుతో బీమా రుణాలు చెల్లించలేరు!

జీవితబీమా పాలసీల ఆధారంగా తీసుకునే రుణాలను క్రెడిట్‌కార్డులతో చెల్లించకుండా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన ఆదేశాల వల్ల, పాలసీదారులు రుణాల ఊబిలో చిక్కుకోకుండా ఉంటారని....

Updated : 10 May 2023 09:12 IST

దిల్లీ: జీవితబీమా పాలసీల ఆధారంగా తీసుకునే రుణాలను క్రెడిట్‌కార్డులతో చెల్లించకుండా బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ తీసుకొచ్చిన ఆదేశాల వల్ల, పాలసీదారులు రుణాల ఊబిలో చిక్కుకోకుండా ఉంటారని బీమా సంస్థల ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆర్థిక క్రమశిక్షణ అనేది ముఖ్యమని, రుణాలను క్రెడిట్‌కార్డుతో చెల్లించకుండా చూడాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ఒకవేళ క్రెడిట్‌కార్డు నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లించలేకపోతే అధిక వడ్డీలను సదరు కంపెనీలు విధిస్తాయని గుర్తు చేశారు. వ్యక్తిగత, పూచీకత్తు లేని రుణాలపై విధించే వడ్డీరేట్లతో పోలిస్తే, జీవితబీమా పాలసీ ఆధారిత రుణరేట్లు చాలా తక్కువగా 8-15 శాతంగా ఉంటాయని కోటక్‌ మహీంద్రా లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ సునీల్‌ శర్మ తెలిపారు. అదే క్రెడిట్‌కార్డు రేట్లు చూస్తే 20% పైనే ఉంటాయని గుర్తు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని