Hero Motocorp: హీరో నుంచి రికార్డు స్థాయిలో కొత్త బైకులు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కొత్త బైకులను తీసుకొచ్చేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమవుతోంది.
దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో కొత్త బైకులను తీసుకొచ్చేందుకు హీరో మోటోకార్ప్ సిద్ధమవుతోంది. మార్కెట్ వాటాలో ఆధిపత్యం కొనసాగించడంతో పాటు ప్రీమియం బైకు విభాగంలో బలోపేతం కావాలని చూస్తున్నట్లు కంపెనీ సీఈఓ నిరంజన్ గుప్తా తెలిపారు. హీరో మోటోకార్ప్- హార్లే డేవిడ్‌సన్ భాగస్వామ్యంలో మొట్టమొదటి ఉత్పత్తిని కూడా ఈ ఆర్థికంలోనే విడుదల చేయడానికి హీరో సన్నాహాలు చేస్తోంది. 100-110 సీసీ బైకుల విభాగంలో అగ్రస్థానంలో ఉన్న కంపెనీ 125 సీసీలోనూ బలపడటానికి చూస్తోంది. 160సీసీ, ఆపైన విభాగాల్లో అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త మోడళ్లు తీసుకురానుంది. భవిష్యత్ అవకాశాలపై కంపెనీ బుల్లిష్‌గా ఉందని, అన్ని విభాగాల్లో మార్కెట్ వాటా పెంచుకునేందుకు ప్రణాళికలు ఉన్నాయని అనలిస్ట్ కాల్‌లో గుప్తా వెల్లడించారు. ప్రతి త్రైమాసికంలోనూ కొత్త మోడళ్లు తీసుకొస్తామని, ముఖ్యంగా 150సీసీ నుంచి 450 సీసీ మధ్య ప్రీమియం విభాగంలో ఎక్కువ విడుదలలు ఉంటాయని వివరించారు. మొత్తం మోటార్‌సైకిల్ విభాగంలో ప్రస్తుతం హీరో మోటోకార్ప్‌కు దాదాపు 51 శాతం మార్కెట్ వాటా ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: ఇది నా బాధ.. ఆవేదన.. ఆక్రందన: న్యాయమూర్తితో చంద్రబాబు
-
Chandrababu: చంద్రబాబు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగింపు
-
Canada: భారత్-కెనడా వివాదం.. అమెరికా స్వరం మారుతోందా..?
-
IND vs AUS : ఈ సిరీస్ అశ్విన్‌కు ట్రయల్ కాదు.. అవకాశం మాత్రమే: ద్రవిడ్
-
Canada Singer: ‘భారత్ నా దేశం కూడా..!’: టూర్ రద్దుపై కెనడా సింగర్ శుభ్
-
Bedurulanka 2012: సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!