హీరో ఎక్స్‌పల్స్‌ 200 4వీ కొత్త వెర్షన్‌ బైక్‌

కఠిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా సరికొత్త వెర్షన్‌ ఎక్స్‌పల్స్‌ 200 4వీని విడుదల చేసినట్లు హీరో మోటోకార్ప్‌ మంగళవారం వెల్లడించింది. 

Published : 17 May 2023 02:06 IST

ప్రారంభ ధర రూ.1.43 లక్షలు

దిల్లీ: కఠిన ఉద్గార నిబంధనలకు అనుగుణంగా సరికొత్త వెర్షన్‌ ఎక్స్‌పల్స్‌ 200 4వీని విడుదల చేసినట్లు హీరో మోటోకార్ప్‌ మంగళవారం వెల్లడించింది. దీని ప్రారంభ ధర రూ.1.43 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌, దిల్లీ). ఈ 200 సీసీ అడ్వెంచర్‌ బైక్‌లో ఆన్‌-బోర్డ్‌ డయాగ్నోస్టిక్స్‌ (ఓబీడీ-2), ఇ20 ఇంజిన్‌ ఉన్నాయి. ఈ రెండు ట్రిమ్‌ల ధరలు వరుసగా రూ.1.43 లక్షలు, రూ.1.5 లక్షలు. ఓబీడీ-2 అనేది స్వయం డయాగ్నోస్టిక్స్‌ వ్యవస్థ. ఇది వాహనంలో ఇబ్బందులను గుర్తిస్తే వెంటనే వినియోగదారుడికి మాల్‌ఫంక్షన్‌ ఇండికేటర్‌ లైట్‌ ద్వారా సమాచారం చేరవేస్తుంది. ఇ20, ఓబీడీ-2 రకం ఎక్స్‌పల్స్‌ 200 4వీతో ప్రీమియం విభాగంపై దృష్టి సారించామని హీరో మోటోకార్ప్‌ ముఖ్య వృద్ధి అధికారి (సీజీఓ) రంజివ్‌జిత్‌ సింగ్‌ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని