LIC: ఏడాదిలో ఎల్‌ఐసీ షేరుకు 40% నష్టం

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) షేరు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అరంగేట్రం చేసి బుధవారానికి (మే 17) ఏడాది నిండింది.

Updated : 18 May 2023 07:19 IST

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎల్‌ఐసీ) షేరు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో అరంగేట్రం చేసి బుధవారానికి (మే 17) ఏడాది నిండింది. ఇష్యూ ధర రూ.949తో పోలిస్తే ఇప్పటివరకు 40% నష్టపోయి.. రూ.570 వద్ద ఈ షేరు ట్రేడవుతోంది. ఫలితంగా మదుపర్ల సంపద రూ.1.93 లక్షల కోట్ల మేర ఆవిరైంది. ఈ ఏడాది కాలంలో ఎల్‌ఐసీ షేరు ఒక్కసారి కూడా ఇష్యూ ధరకు చేరలేదు. రూ.920 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని, రూ.530.20 వద్ద కనిష్ఠాన్ని నమోదుచేసింది. ఇదే సమయంలో సెన్సెక్స్‌ 7,242 పాయింట్లు, నిఫ్టీ 1,922 పాయింట్లు పెరిగాయి. నమోదు రోజు రూ.5.54 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో.. దేశీయంగా అగ్రగామి 5 విలువైన కంపెనీల్లో ఒకటిగా ఎల్‌ఐసీ నిలిచింది. ప్రస్తుతం రూ.3.60 లక్షల కోట్ల మార్కెట్‌ విలువతో 13వ స్థానంలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు