188 కి.మీ. వేగంతో ప్రయాణించే విద్యుత్తు బైక్‌

గోవాకు చెందిన విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ కబీరా మొబిలిటీ, కేఎమ్‌5000 అనే విద్యుత్‌ బైక్‌ను శుక్రవారం ఆవిష్కరించింది.

Published : 20 May 2023 02:44 IST

దిల్లీ: గోవాకు చెందిన విద్యుత్‌ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ కబీరా మొబిలిటీ, కేఎమ్‌5000 అనే విద్యుత్‌ బైక్‌ను శుక్రవారం ఆవిష్కరించింది. ఇది గంటకు 188 కి.మీ. గరిష్ఠ వేగాన్ని అందుకోగలదని, ఒక ఛార్జింగ్‌తో 344 కి.మీ. వరకు ప్రయాణించగలదని కంపెనీ చెబుతోంది. ఈ ఏడాది చివర్లో ఈ బైక్‌ను అధికారికంగా ఆవిష్కరించి.. 2024 నుంచి డెలివరీలను ప్రారంభించాలని సంస్థ భావిస్తోంది. ఈ క్రూయిజర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర రూ.3.15 లక్షల(ఎక్స్‌ షోరూం-గోవా) నుంచి ప్రారంభమవుతుంది. ఈ సంస్థ 2021 ఫిబ్రవరిలో కేఎమ్‌3000, కేఎమ్‌4000 ఇ-బైక్‌లను తీసుకొచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని