రాగి కిందకు!

పసిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం పైకి వెళితే రూ.60,944 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.61,412; రూ.62,434 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

Updated : 22 May 2023 06:48 IST

కమొడిటీస్‌
ఈ వారం

పసిడి

సిడి జూన్‌ కాంట్రాక్టు ఈవారం పైకి వెళితే రూ.60,944 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.61,412; రూ.62,434 వరకు పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ రూ.59,965 కంటే కిందకు వస్తే రూ.59,454; రూ.58,518 వరకు పడిపోవచ్చు. 24న వెలువడే అమెరికా ఫెడ్‌ సమావేశ ముఖ్యాంశాలు, ఇతర కీలక ఆర్థిక గణాంకాలపై ట్రేడర్లు దృష్టి సారిస్తారు.


వెండి

వెండి జులై కాంట్రాక్టు కిందకు వస్తే రూ.72,215 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.71,081 వరకు దిద్దుబాటు అవ్వొచ్చు. ఒకవేళ రూ.74,079 స్థాయిని అధిగమిస్తే     రూ.74,809 వరకు రాణించొచ్చు.


ప్రాథమిక లోహాలు

* రాగి మే కాంట్రాక్టు రూ.737 కంటే ఎగువన కదలాడకుంటే, మరింత కిందకు రావచ్చు. అందువల్ల రూ.737 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని, రూ.729- రూ.735 సమీపంలో కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే.

* సీసం మే కాంట్రాక్టు రూ.184.75 కంటే పైన చలించకుంటే ప్రతికూల ధోరణికి ఆస్కారం ఉంటుంది.

* జింక్‌ మే కాంట్రాక్టు రూ.221 కంటే దిగువన కదలాడితే లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండాలి. ఒకవేళ రూ.228 కంటే పైన చలిస్తే కాంట్రాక్టు పుంజుకునే అవకాశం ఉంటుంది.

* అల్యూమినియం మే కాంట్రాక్టు రూ.209 ఎగువన మాత్రమే కొనుగోలు చేయాలి.    రూ.206 దిగువకు వస్తే లాంగ్‌ పొజిషన్ల జోలికి పోకూడదు.


ఇంధన రంగం

* ముడి చమురు జూన్‌ కాంట్రాక్టును రూ.5,742 దిగువన షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. ఈ స్థాయి ఎగువన కదలాడితే రూ.6,108; రూ.6,197 వరకు కాంట్రాక్టు రాణించే అవకాశం ఉంటుంది.

* సహజవాయువు జూన్‌ కాంట్రాక్టు రూ.206 కంటే దిగువన కదలాడకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. అయితే రూ.238 వద్ద నిరోధం ఎదురయ్యే అవకాశం ఉంది. ఒకవేళ ఈ స్థాయిని అధిగమిస్తే రూ.252 వరకు పెరగొచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

* పసుపు జూన్‌ కాంట్రాక్టు రూ.8,088 కంటే పైన కదలాడితే లాంగ్‌ పొజిషన్లను అట్టేపెట్టుకోవచ్చు. అయితే రూ.8,358 వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకునే వీలుంది.  

* జీలకర్ర జూన్‌ కాంట్రాక్టు రూ.47,291 కంటే పైన కదలాడకుంటే మరింత కిందకు రావచ్చు. ఒకవేళ ఈ స్థాయికి పైన చలిస్తే సానుకూల ధోరణికి అవకాశం ఉంటుంది.

* పత్తి జూన్‌ కాంట్రాక్టు రూ.60,493 కంటే కిందకు వస్తే మరింతగా పడిపోవచ్చు. ఒకవేళ రూ.61,573 కంటే పైకి వెళితే రూ.61,880; రూ.62,196 వరకు పెరగొచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు