Banks Profits: రూ.1 లక్ష కోట్లు మించిన ప్రభుత్వరంగ బ్యాంకుల లాభాలు
గత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్బీ)ల నికర లాభాలన్నీ కలిపి రూ.1 లక్ష కోట్లను అధిగమించాయి. ఇందులో దాదాపు సగం వాటా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)దే.
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో 12 ప్రభుత్వరంగ బ్యాంకు (పీఎస్బీ)ల నికర లాభాలన్నీ కలిపి రూ.1 లక్ష కోట్లను అధిగమించాయి. ఇందులో దాదాపు సగం వాటా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)దే. 2017-18లో పీఎస్బీలన్నీ కలిపి రూ.85,390 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేశాయి. 2022-23లో ఇవి రూ.1,04,649 కోట్ల నికరలాభాన్ని ప్రకటించడం గమనార్హం. 2021-22లో వీటి లాభం రూ.66,539.98 కోట్ల కంటే, ఇది 57% అధికం. 2021-22లో రూ.3457 కోట్ల లాభాన్ని ఆర్జించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) 2022-23లో 27% తక్కువగా రూ.2507 కోట్లే నమోదు చేసింది. నిరర్థక ఆస్తులను పారదర్శకంగా గుర్తించి, రికవరీకి చర్యలు తీసుకోవడం, పీఎస్బీలకు మూలధనం సమకూర్చడం, సంస్కరణలే పీఎస్‌బీల లాభాలకు కారణమని చెబుతున్నారు. 2022-23 మార్చి త్రైమాసికంలో పీఎస్‌బీల లాభాలు రూ.34,483 కోట్లుగా ఉన్నాయి. 2021-22 ఇదేకాల లాభాలు రూ.17,666 కోట్ల కంటే ఇవి 95% అధికం కావడం గమనార్హం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.