సంక్షిప్తంగా
విద్యుత్ ద్విచక్రవాహనాలపై రాయితీలను ఒక్కసారిగా తగ్గించడం వల్ల విద్యుత్ వాహన అమ్మకాలు తగ్గే ప్రమాదం ఉందని సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్‌ఎంఈవీ) పేర్కొంది.
* విద్యుత్ ద్విచక్రవాహనాలపై రాయితీలను ఒక్కసారిగా తగ్గించడం వల్ల విద్యుత్ వాహన అమ్మకాలు తగ్గే ప్రమాదం ఉందని సొసైటీ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఎస్‌ఎంఈవీ) పేర్కొంది. విద్యుత్ వాహన పరిశ్రమపై ఇది ప్రతికూల ప్రభావం చూపొచ్చని అభిప్రాయపడింది. అంకుర సంస్థలు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించాయి. విద్యుత్ వాహన పరిశ్రమ సొంత కాళ్లపై నిలబడాల్సిన సమయం వచ్చిందని పేర్కొన్నాయి.
* కొన్ని సేవలు అందించేందుకు మొబైల్ నంబరు తెలియజేయాల్సిందిగా వినియోగదారులను ఇబ్బంది పెట్టవద్దని రిటైలర్లకు వినియోగదారు వ్యవహారాల మంత్రిత్వ శాఖ నియామవళి జారీ చేసినట్లు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో దీన్ని జారీ చేసినట్లు వెల్లడించారు.
* రూ.2000 కరెన్సీ నోట్ల ఉపసంహరణతో డిపాజిట్లు, వడ్డీ రేట్లపై సానుకూల ప్రభావం ఉంటుందని ఎస్‌బీఐ నివేదిక అభిప్రాయపడింది. రూ.2000 రూపంలో మొత్తం చలామణిలో ఉన్న రూ.3.6 లక్షల కోట్ల నగదు వెనక్కి వచ్చే అవకాశం ఉందని తెలిపింది.
* పైలెట్ల వేతనాలను స్పైస్‌జెట్ పెంచింది. విమాన కెప్టెన్‌ల వేతనాన్ని నెలకు రూ.7.5 లక్షలకు(75 ఫ్లైయింగ్ అవర్స్) పెంచింది. నెలకు రూ.లక్ష వరకు లాయాల్టీ రివార్డ్‌ను సైతం ప్రకటించింది. అంతక్రితం నెలకు రూ.7 లక్షలు(80 ఫ్లైయింగ్ అవర్స్)గా ఉండేది.
* జియో మార్ట్‌లో దాదాపు 700 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చినట్లు రిలయన్స్ రిటైల్ వర్గాలు తెలిపాయి.
* అంతర్జాతీయ సంస్థలకు వ్యాపార విలువను పెంచేందుకు కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత టోపాజ్ సేవలను ప్రారంభిస్తున్నట్లు ఇన్ఫోసిస్ ప్రకటించింది.
* జనరల్ షూరిటీ బాండ్ బీమా పేరిట బీమా పథకాన్ని ఎస్‌బీఐ జనరల్ ఇన్సూరెన్స్ ఆవిష్కరించింది.
* జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)తో రూ.2,132 రహదారి ప్రాజెక్ట్ ఒప్పందాన్ని అనుబంధ సంస్థ సమఖియాలీ టోల్‌వే పూర్తి చేసినట్లు ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్ వెల్లడించింది.
ఎన్‌ఎండీసీ లాభం రూ.2,277 కోట్లు
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్‌ఎండీసీ లిమిటెడ్ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికానికి రూ.5,851 కోట్ల టర్నోవరును, రూ.2,277 కోట్ల నికరలాభాన్ని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి టర్నోవరు రూ.17,667 కోట్లు, నికరలాభం రూ.5,529 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 40.82 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసి, 38.22 మిలియన్ టన్నుల ఖనిజాన్ని విక్రయించినట్లు ఎన్‌ఎండీసీ వెల్లడించింది. ఒక ఆర్థిక సంవత్సరంలో వరుసగా రెండేళ్ల పాటు 40 మిలియన్ టన్నులకు మించిన ఉత్పత్తిని నమోదు చేసిన ఘనత తమకు దక్కుతుందని ఎన్‌ఎండీసీ ఇన్‌ఛార్జి సీఎండీ అమితవ ముఖర్జీ వివరించారు. వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ.2.85 చొప్పున తుది డివిడెండ్ చెల్లించాలని ఎన్‌ఎండీసీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది. అంతక్రితం ఒక్కో షేరుకు రూ.3.75 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించింది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు
-
World News
ప్రాణం తీసిన సోషల్ మీడియా సవాల్
-
India News
మహిళ గొలుసు మింగేసిన దొంగ.. కాపాడాలని పోలీసులను వేడుకోలు
-
Politics News
అసెంబ్లీ ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా.. సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
-
Politics News
‘ఆ విగ్రహాన్ని తొలగిస్తే తుపాకీతో కాల్చేస్తా!’.. మాజీ మంత్రి చిన్నారెడ్డి
-
Crime News
క్షణికావేశంలో ఆలుమగల బలవన్మరణం