Online Bus Ticket: బస్సు ఆలస్యమైతే టికెట్‌ సొమ్ము వాపస్‌

ఆన్‌లైన్‌లో బస్సు టికెట్‌ బుకింగ్‌ సేవలను అందించే అభిబస్‌ తన ప్రచారకర్తగా సినీ నటుడు మహేశ్‌ బాబును కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

Updated : 24 May 2023 09:59 IST

అభిఅస్యూర్డ్‌ను ప్రారంభించిన అభిబస్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌లో బస్సు టికెట్‌ బుకింగ్‌ సేవలను అందించే అభిబస్‌ తన ప్రచారకర్తగా సినీ నటుడు మహేశ్‌ బాబును కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. ఇక్సిగో గ్రూపు అనుబంధ సంస్థ అయిన అభిబస్‌ కొత్తగా పలు సేవలనూ అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపింది. మంగళవారం ఇక్కడ సంస్థ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 25 మంది బస్‌ ఆపరేటర్లతో కలిసి అభిఅస్యూర్డ్‌ను ప్రారంభించినట్లు తెలిపారు. బస్సు రద్దు అయినప్పుడు టికెట్‌ విలువలో 150%, సౌకర్యాలు నచ్చకపోతే 100%, బస్సు ఆలస్యమైతే మొత్తం టికెట్‌ డబ్బులు వెనక్కి ఇస్తున్నట్లు తెలిపారు.

తెలుగు రాష్ట్రాల్లో ఏడాదికి రూ.16,000 కోట్ల విలువైన బస్సు టిక్కెట్లు అమ్ముడవుతున్నాయని, ఇందులో ఆన్‌లైన్‌ టిక్కెట్ల వాటా రూ.300 కోట్ల వరకూ ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌ టికెట్‌ల మార్కెట్‌ మరింత విస్తరించేందుకు అవకాశాలున్నాయని పేర్కొన్నారు. 16వ వార్షికోత్సవం సందర్భంగా 16,000 మందికి రూ.16కే టికెట్‌ను అందించనున్నట్లు తెలిపారు. ఇది ఈ నెలాఖరు వరకూ అందుబాటులో ఉంటుందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని