‘లైఫ్‌’ సేవలను ప్రారంభించిన లుపిన్‌ డిజిటల్‌ హెల్త్‌

ఫార్మా సంస్థ లుపిన్‌కు అనుబంధంగా ప్రారంభమైన లుపిన్‌ డిజిటల్‌ హెల్త్‌, హృద్రోగ బాధితులకు ఉపయోగపడేలా ‘లైఫ్‌’ అనే ప్రత్యేక సేవలను ప్రారంభించింది.

Published : 25 May 2023 01:56 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఫార్మా సంస్థ లుపిన్‌కు అనుబంధంగా ప్రారంభమైన లుపిన్‌ డిజిటల్‌ హెల్త్‌, హృద్రోగ బాధితులకు ఉపయోగపడేలా ‘లైఫ్‌’ అనే ప్రత్యేక సేవలను ప్రారంభించింది. ఇందులో భాగంగా గుండె జబ్బులున్నవారు, శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి అవసరమయ్యే ప్రత్యేక పరికరాలను అద్దె ప్రాతిపదికన అందించనున్నట్లు తెలిపింది. బుధవారం సంస్థ సీఈఓ సిద్దార్థ్‌ శ్రీనివాసన్‌, బిజినెస్‌ హెడ్‌ రాజేశ్‌ ఖన్నా మాట్లాడుతూ.. గుండె జబ్బులున్న వారిని నిరంతరం పర్యవేక్షించేలా కృత్రిమ మేధ, బిగ్‌ డేటాలను మిళితం చేసి, 6 పరికరాలను అందిస్తున్నట్లు తెలిపారు. గుండె పనితీరు, రక్తంలో గ్లూకోజు స్థాయిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇవి తోడ్పడతాయి. దేశంలో 6 వేల మంది కార్డియాలజిస్టులుంటే, బాధితులు లక్షల్లో ఉన్నారని పేర్కొన్నారు. లైఫ్‌ ప్రోగ్రాం కోసం 400 మంది వైద్యులతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపారు. ఆగస్టు నాటికి ఈ సంఖ్య దాదాపు 5వేలకు చేరుతుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, కాకినాడ, కరీంనగర్‌, తిరుపతిలలో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. రెండు రాష్ట్రాల్లో 80 మంది వైద్యులు తమ వేదిక నుంచి సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఆసుపత్రులతోనూ ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు వివరించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని