2047 నాటికి అందరికీ బీమా!

దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి, దేశంలోని ప్రజలందరికీ బీమా సదుపాయం కల్పించేలా పని చేస్తున్నామని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్‌ దేవాశిష్‌ పాండా వెల్లడించారు.

Published : 26 May 2023 00:57 IST

ఐఆర్‌డీఏఐ ఛైర్మన్‌ దేవాశిష్‌ పాండా

దిల్లీ: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి, దేశంలోని ప్రజలందరికీ బీమా సదుపాయం కల్పించేలా పని చేస్తున్నామని భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) ఛైర్మన్‌ దేవాశిష్‌ పాండా వెల్లడించారు. గత 10-12 నెలల్లో జీవిత బీమా పథకాలను పెంచేందుకు ఐఆర్‌డీఏఐ అనేక చర్యలు తీసుకున్నట్లు సీఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ పాండా వివరించారు. చెల్లింపుల్లో యూపీఐ (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) ఎంత సంచలనం సృష్టించిందో, బీమా రంగంలో జీవిత, సాధారణ బీమా పథకాల్లోనూ భారీ కదలిక తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని దేవాశిష్‌ తెలిపారు. బీమా సుగమ్‌, బీమా విస్తార్‌, మహిళల బీమా వాహక్‌ (బీమా ట్రినిటీ) ద్వారా ప్రజలందరికీ బీమా ప్రతిపాదనను ముందుకు తీసుకెళుతున్నామన్నారు. నియమాల ఆధారిత నుంచి అత్యధికులకు బీమాను చేరువ చేసే విధానంలోకి ఐఆర్‌డీఏఐ మారుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని