ఈ ఏడాది చివరికల్లా ఓలా ఎలక్ట్రిక్‌ ఐపీఓ!

విద్యుత్తు స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ ఈ ఏడాది చివరి కల్లా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావాలని భావిస్తోంది.

Published : 26 May 2023 00:58 IST

దిల్లీ: విద్యుత్తు స్కూటర్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ ఈ ఏడాది చివరి కల్లా స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావాలని భావిస్తోంది. ఇందుకవసరమైన ప్రక్రియ కోసం గోల్డ్‌మ్యాన్‌ శాక్స్‌, కోటక్‌లను ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లుగా నియమించుకుందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ తెలిపింది. సాఫ్ట్‌బ్యాంక్‌ గ్రూప్‌ కార్ప్‌, టైగర్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ వంటి సంస్థలు ఈ కంపెనీకి మద్దతుగా ఉన్నాయి. గతేడాది నిధుల సమీకరణ సమయంలో ఓలా ఎలక్ట్రిక్‌ కంపెనీ విలువను 5 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.41,000 కోట్లు)గా లెక్కగట్టారు. అయితే మరింత విలువను కంపెనీ కోరుకుంటోంది. ఐపీఓ ద్వారా ఎంత మేర నిధులను సమీకరించాలనుకుంటుందో కూడా ఇంకా తెలియరాలేదు. ఒక వేళ కంపెనీ  10 శాతం వాటాను విక్రయించినా, ఈ ఏడాది అతిపెద్ద ఐపీఓ ఇదే అవుతుంది. ఈ కంపెనీ ఏప్రిల్‌లో ఇప్పటిదాకా అత్యధిక నెలవారీ విక్రయాలు (30,000 వాహనాలు) సాధించింది. విద్యుత్తు బ్యాటరీతో నడిచే మోటార్‌ సైకిళ్లు,  కారును కూడా తీసుకువచ్చే ప్రణాళికల్లోనూ కంపెనీ ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని