లక్ష ఈవీలు అమ్ముతాం

ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ బలంగా నమోదుకావొచ్చని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాలు-  విద్యుత్తు విభాగ ఎండీ శైలేష్‌ చంద్ర అంచనా వేస్తున్నారు.

Published : 26 May 2023 00:59 IST

టాటా మోటార్స్‌ ఎండీ శైలేష్‌ చంద్ర

గోవా: ప్రయాణికుల వాహన (కార్లు, ఎస్‌యూవీలు, వ్యాన్ల) విక్రయాలు ఈ ఆర్థిక సంవత్సరంలోనూ బలంగా నమోదుకావొచ్చని టాటా మోటార్స్‌ ప్రయాణికుల వాహనాలు-  విద్యుత్తు విభాగ ఎండీ శైలేష్‌ చంద్ర అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఎస్‌యూవీల జోరు మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 50,000 వరకు విద్యుత్‌ ప్రయాణికుల వాహనాలను సంస్థ విక్రయించగా, ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష అమ్మకాలను కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఆల్ట్రోజ్‌ ఐసీఎన్‌జీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ ఆవిష్కరణతో సీఎన్‌జీ వాహనాలను మరింతగా ముందుకు తీసుకెళ్లాలనీ భావిస్తోంది. ‘ఇప్పటిదాకా సంకేతాలు బాగున్నాయి. పాత ఆర్డర్లు, తక్కువ ఇన్వెంటరీ వల్ల గిరాకీ అధిక స్థాయిల్లో ఉంది. దీని వల్ల పరిశ్రమ మొత్తం నెలకు 3,10,000 చొప్పున వాహనాలను రిటైల్‌గా విక్రయించగలద’ని ఆయన అన్నారు. ‘రెండేళ్ల కిందట పరిశ్రమ మొత్తం మీద ఒక ఆర్థిక సంవత్సరంలో 27-30 లక్షల వాహన అమ్మకాలు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇవి 39 లక్షలకు చేరాయి. ఈ ఏడాది 41 లక్షలకు చేరొచ్చు. ఇది వాహన పరిశ్రమకు చాలా మంచి విషయమ’న్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు