కార్యకలాపాల పునఃప్రారంభంపై 30 రోజుల్లోగా ప్రణాళిక సమర్పించండి

విమాన సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా తమకు సమర్పించాలని, గో ఫస్ట్‌ను పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఆదేశించినట్లు తెలుస్తోంది.

Published : 26 May 2023 01:06 IST

గో ఫస్ట్‌కు సూచించిన డీజీసీఏ

దిల్లీ: విమాన సర్వీసుల పునఃప్రారంభానికి సంబంధించిన ప్రణాళికను 30 రోజుల్లోగా తమకు సమర్పించాలని, గో ఫస్ట్‌ను పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌ (డీజీసీఏ) ఆదేశించినట్లు తెలుస్తోంది. మే 24న డీజీసీఏ ఈ సూచన చేసిందని సమాచారం. కార్యకలాపాల పునఃప్రారంభానికి ఎన్ని విమానాలు అందుబాటులో ఉన్నాయి? పైలట్లు, ఇతర సిబ్బంది లభ్యత, నిర్వహణ వసతులు, నిధులు, మూలధనం, విమానాల అద్దె సంస్థలు, వెండర్లతో ఒప్పందాలు లాంటి వివరాలన్నీ ఆ ప్రణాళికలో పొందుపర్చాల్సిందిగా గో ఫస్ట్‌కు డీజీసీఏ సూచించిందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. గో ఫస్ట్‌ ఈ ప్రణాళికను సమర్పించాక, దానిపై డీజీసీఐ సమీక్ష జరిపి తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టాలో నిర్ణయం తీసుకుంటుందని వివరించాయి. గోఫస్ట్‌ ఈనెల 3 నుంచి విమాన సర్వీసులను ఆపేసి, స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసుకోగా, అమలు ప్రక్రియ ఆరంభమైన సంగతి విదితమే. ఆకస్మికంగా విమాన సర్వీసులు రద్దు చేయడంపై గో ఫస్ట్‌కు గతంలో డీజీసీఏ షోకాజ్‌ నోటీసులు పంపగా, ఈనెల 8న గోఫస్ట్‌ తన వివరణ సమర్పించింది. పునరుద్ధరణ ప్రణాళిక రూపకల్పన కోసం మారటోరియం సమయాన్ని ఉపయోగించుకునేందుకు అనుమతిని ఇవ్వాలని ఆ వివరణలో గోఫస్ట్‌ అడిగినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు