జోయాలుక్కాస్‌ నుంచి అతిపెద్ద జ్యువెలరీ ఫెస్టివల్‌

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ జోయాలుక్కాస్‌ అతిపెద్ద జ్యువెలరీ ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని ఆభరణాలపై మజూరీ ఛార్జీల్లో (V.A) 50 శాతం తగ్గింపును ప్రకటించింది.

Published : 26 May 2023 14:12 IST

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్‌ జోయాలుక్కాస్‌ అతిపెద్ద జ్యువెలరీ ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా అన్ని ఆభరణాలపై మజూరీ ఛార్జీల్లో (V.A) 50 శాతం తగ్గింపును ప్రకటించింది. ఈ ఆఫర్‌ అన్ని జోయాలుక్కాస్‌ షోరూమ్‌లలో లభిస్తుంది. గోల్డ్‌, డైమండ్స్‌, ప్రెషస్‌ స్టోన్స్‌, వెండి ఆభరణాలపై ఈ ఆఫర్‌ చెల్లుతుందని సంస్థ ప్రకటించింది. ఈ ఆఫర్‌ మే 12 నుంచి జూన్‌ 11 వరకు అందుబాటులో ఉంటుందని తెలిపింది. ఈ ప్రత్యేకమైన ఆఫర్‌కు అదనంగా జోయాలుక్కాస్‌లో చేసిన ప్రతి కొనుగోలుతో కస్టమర్స్‌ ఉచిత జీవిత కాల నిర్వహణ, ఒక సంవత్సర ఉచిత బీమా, బైబ్యాక్‌ హామీ కూడా పొందుతారు. భారతదేశపు సంప్రదాయబద్ధమైన, సమకాలీన, ఇటాలియన్‌, టర్కిష్‌, ఎథ్నో సహా గొప్ప కలెక్షన్ల శ్రేణిని జోయాలుక్కాస్‌ అందిస్తోంది. షాపింగ్‌ అనుభవం గుర్తుండిపోయేలా.. ప్రపంచ స్థాయి పరిసరాలు, శిక్షణ పొందిన కస్టమర్‌ సర్వీస్‌ టీమ్‌, సౌకర్యవంతమైన పార్కింగ్‌ సదుపాయాలు ఉన్నాయి.

అతిపెద్ద జ్యువెలరీ ఫెస్టివల్‌ గురించి ఛైర్మన్‌, జోయాలుక్కాస్‌ గ్రూప్‌ ఎండీ జాయ్‌ అలుక్కాస్‌  మాట్లాడుతూ..‘మేం సాటిలేని జ్యువెలరీ అనుభవాన్ని అందించడానికి కట్టబడి ఉన్నాం. కస్టమర్ల ప్రతి అవసరాన్ని తీర్చే ఉత్తమమైన, విస్తృతమైన జ్యువెలరీ ఎంపికను వారి కోసం తీసుకువచ్చాం. జోయాలుక్కాస్‌లో ఈ ప్రత్యేకమైన ఫెస్టివల్‌ సందర్భంగా అన్ని జ్యువెలరీ తయారీ ఛార్జీల (V.A)పై కస్టమర్లకు 50 శాతం ఫ్లాట్‌ తగ్గింపు ఇస్తోంది. ఈ ఆఫర్‌ పొందడానికి, ఇంతకుముందు లేని విధంగా సాటిలేని జ్యువెలరీ షాపింగ్‌ అనుభవాన్ని పొందేందుకు దగ్గరలో ఉన్న మా ఆధునిక షోరూమ్‌ను కస్టమర్లు సందర్శించవచ్చు. ప్రపంచంలో ఒకే ‘జాయ్‌’అలుక్కాస్‌ ఉన్నారని గుర్తుంచుకోండి. ఇదే పేరుతో ఎవరైనా మా నెట్‌వర్క్‌లో భాగమని ప్రకటిస్తున్నవారు జోయాలుక్కాస్‌లో భాగం కాదు’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు