Bank Account: బ్యాంకు ఖాతాలో రూ.456 ఉన్నాయా?

మీ బ్యాంకు ఖాతాలో రూ.456 ఉన్నాయా? ఎందుకు అనుకుంటున్నారా? చాలామంది ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పాలసీలు తీసుకున్నారు.

Updated : 27 May 2023 10:21 IST

ఈనాడు, హైదరాబాద్‌: మీ బ్యాంకు ఖాతాలో రూ.456 ఉన్నాయా? ఎందుకు అనుకుంటున్నారా? చాలామంది ప్రధాన మంత్రి జీవన్‌ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై) పాలసీలు తీసుకున్నారు. ఇప్పుడు ఈ బీమా పాలసీలకు ప్రీమియం చెల్లించే తరుణం వచ్చింది. బ్యాంకులు నేరుగా మీ ఖాతా నుంచి ఈ ప్రీమియాన్ని డెబిట్‌ చేసుకుంటాయి. ఈ నెల 31లోగా ఎప్పుడైనా సరే ప్రీమియాన్ని వసూలు చేస్తామని బ్యాంకులు ఇప్పటికే ఖాతాదారులకు సందేశాలు పంపిస్తున్నాయి.

అందరినీ బీమా పరిధిలోకి తీసుకురావాలన్న లక్ష్యంతో కేంద్రం తీసుకొచ్చిన బీమా పథకాలే పీఎంజేజేబీవై, పీఎంఎస్‌బీవై. తక్కువ ఆదాయ వర్గాలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేలా ఈ పాలసీలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకు పొదుపు ఖాతాకు అనుబంధంగా ఈ పాలసీలను తీసుకునేందుకు వీలుంటుంది.

పీఎంఎస్‌బీవై: వ్యక్తిగత ప్రమాద బీమా తరహా పాలసీ ఇది. ప్రమాదవశాత్తు మరణం, శాశ్వత వైకల్యం సంభవిస్తే రూ.2లక్షల పరిహారం ఇచ్చేలా ఈ పాలసీని రూపొందించారు. దీనికి రూ.20 ప్రీమియం చెల్లించాలి. 18-70 ఏళ్లలోపు వారికి ఈ పాలసీ వర్తిస్తుంది.

పీఎంజేజేబీవై: జీవిత బీమా పాలసీ ఇది. పాలసీదారుడు వయసు 18-50 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రీమియం రూ.436. పాలసీదారుడు మరణించినప్పుడు నామినీకి రూ.2లక్షల పరిహారం అందుతుంది. పాలసీదారుడి వయస్సు 50 ఏళ్లు దాటినా మరో 5 ఏళ్లపాటు ప్రీమియం చెల్లింపును పొడిగించుకునే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని