42% తగ్గిన గ్రాసిమ్‌ లాభం

మార్చి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ రూ.2,355.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.4,070.46 కోట్లతో పోలిస్తే ఇది 42.12% తక్కువ.

Updated : 27 May 2023 06:33 IST

దిల్లీ: మార్చి త్రైమాసికంలో ఆదిత్య బిర్లా గ్రూప్‌ సంస్థ గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌ రూ.2,355.67 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదే కాల లాభం రూ.4,070.46 కోట్లతో పోలిస్తే ఇది 42.12% తక్కువ. ఇదే సమయంలో మొత్తం కార్యకలాపాల ఆదాయం రూ.28,811.39 కోట్ల నుంచి రూ.33,462.14 కోట్లకు వృద్ధి చెందింది. మొత్తం వ్యయాలు రూ.25,786.54 కోట్ల నుంచి రూ.30,354.70 కోట్లకు పెరిగాయి.  

పూర్తి ఆర్థిక సంవత్సరంలో: 2022-23లో గ్రాసిమ్‌ లాభం 1.14% తగ్గి రూ.11,078.20 కోట్లుగా నమోదైంది. 2021-22లో కంపెనీ లాభం రూ.11,206.29 కోట్లుగా ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో గ్రాసిమ్‌ రూ.లక్ష కోట్ల ఆదాయ మైలురాయిని సాధించింది. మొత్తం కార్యకలాపాల ఆదాయం ఏడాది వ్యవధిలో రూ.95,701.13 కోట్ల నుంచి రూ.1,17,627.08 కోట్లకు పెరిగింది. మూలధన వ్యయాలు రూ.4,307 కోట్లుగా ఉన్నాయి. 2022-23కు రూ.2 ముఖవిలువ కలిగిన ఒక్కో షేరుపై రూ.10 డివిడెండును బోర్డు సిఫారసు చేసింది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని