కాప్‌28 సలహా సంఘంలో అంబానీ

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సలహా కమిటీలో సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు.

Published : 27 May 2023 02:04 IST

సునీతా నారాయణ్‌కూ దక్కిన గౌరవం

దిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీకి అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ సలహా కమిటీలో సభ్యుడిగా ఆయన ఎంపికయ్యారు. కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ పార్టీస్‌ 28వ సెషన్‌(కాప్‌28) ప్రెసిడెన్సీకి మార్గదర్శకత్వం, సలహాలను ఇచ్చే కాప్‌28 యూఏఈ అడ్వైజరీ కమిటీ 6 ఖండాల్లోని దేశాలకు చెందిన పర్యావరణ నాయకుల అనుభవాన్ని వినియోగించుకుంటుంది. సంప్రదాయ ముడి చమురు రిఫైనరీ, పెట్రో రసాయనాల నుంచి పునరుత్పాదక ఇంధనం వైపు రిలయన్స్‌ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కమిటీలో ప్రపంచంలోని నలుమూలల నుంచి ప్రభుత్వ, పరిశ్రమ, ఇంధన, ఆర్థిక, పౌర సమాజం, యువత వంటి వర్గాల నుంచి మొత్తం 31 మంది సభ్యులు ఉంటారు. ఈ కమిటీకి యూఏఈ పరిశ్రమల మంత్రి సుల్తాన్‌ అహ్మద్‌ అల్‌ జబీర్‌ ప్రెసిడెంట్‌ డిజిగ్నేట్‌గా ఉంటారని యునైటెడ్‌ నేషన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ కన్వెన్షన్‌ ఆన్‌ క్లైమేట్‌ ఛేంజ్‌(యూఎన్‌ఎఫ్‌సీసీసీ) సెక్రటేరియట్‌ జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇపుడు ఆ సలహా బోర్డులోని 31 మంది పేర్లను ప్రకటించారు. ఇందులో బ్లాక్‌రాక్‌ సీఈఓ లారీ ఫింక్‌, సీమెన్స్‌ బోర్డు ఛైర్మన్‌ జో కేసర్‌, బీపీ మాజీ అధిపతి బాబ్‌ డూడ్లే తదితరులున్నారు. భారత్‌ నుంచి ప్యానెల్‌లో ముకేశ్‌ అంబానీతో పాటు సభ్యత్వం ఉన్న ఇంకో వ్యక్తి పర్యావరణ ప్రచారకులు సునీతా నారాయణ్‌ మాత్రమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు