మే 28 వరకు విమానాల రద్దు: గోఫస్ట్‌

ఈనెల 28 వరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు గో ఫస్ట్‌ తెలిపింది. ఈ సమయంలో ప్రయాణం కోసం ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి, డబ్బులను పూర్తిగా రిఫండ్‌ చేస్తామని పేర్కొంది.

Updated : 27 May 2023 06:32 IST

దిల్లీ: ఈనెల 28 వరకు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు గో ఫస్ట్‌ తెలిపింది. ఈ సమయంలో ప్రయాణం కోసం ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి, డబ్బులను పూర్తిగా రిఫండ్‌ చేస్తామని పేర్కొంది. ఈనెల 3 నుంచి సంస్థ విమానాలు నిలిపివేసిన సంగతి విదితమే. దివాలా పరిష్కార ప్రక్రియ కోసం ఎన్‌సీఎల్‌టీకి దరఖాస్తు సమర్పించిచాక, విమానాల రద్దును పొడిగించడం ఇది ఏడో సారి.ప్రయాణికులకు టికెట్‌ డబ్బులను ఎప్పటికి తిరిగి ఇస్తుందో కంపెనీ వెల్లడించలేదు.

జెట్‌ ఎయిర్‌వేస్‌ చెల్లింపులకు జలాన్‌ కల్‌రాక్‌కు మరింత సమయం: దివాలా ప్రక్రియలో జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసిన, జలాన్‌ కల్‌రాక్‌ బృందం సంబంధిత చెల్లింపులు జరిపేందుకు మరింత సమాయాన్ని జాతీయ కంపెనీల చట్టం అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఇచ్చింది. జలాన్‌ కల్‌రాక్‌ బృందం సమర్పించిన రూ.175 కోట్ల బ్యాంకు గ్యారెంటీలను చెల్లింపుల కింద జమచేసుకోవద్దని రుణ సంస్థలను ఆదేశించింది. రుణ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌లపై విచారణ జరిపిన 2022 నవంబరు 16 నుంచి 2023 మార్చి 3 మధ్య కాలాన్ని చెల్లింపుల సమయం నుంచి మినహాయిస్తూ.. ఆ మేరకు అదనపు సమయాన్ని ఇస్తూ ఎన్‌సీఎల్‌ఏటీ నిర్ణయం తీసుకుంది. ‘వాటాదార్ల ప్రయోజనాల దృష్ట్యా జెట్‌ ఎయిర్‌వేస్‌ సాధ్యమైనంత త్వరగా కార్యకలాపాలను ప్రారంభించడం ఎంతో ముఖ్యం. జెట్‌ ఎయిర్‌వేస్‌ పునరుద్ధరణ కోసం రుణ సంస్థల పర్యవేక్షణ కమిటీ, జలాన్‌ కల్‌రాక్‌ బృందం పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాల’ని ఎన్‌సీఎల్‌ఏటీ సూచించింది. జెట్‌ ఎయిర్‌వేస్‌కు బోర్డు డైరెక్టర్ల నియామకంపై రుణ సంస్థలు దాఖలు చేసిన పిటిషన్‌ను ఎన్‌సీఎల్‌ఏటీ స్వీకరించింది. దీనిపై జులై 19న విచారణ చేస్తామని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు