కంపెనీలపై నిబంధనల భారాన్ని తగ్గించాలి

దేశంలోని కంపెనీలపై నిబంధనల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని దిగ్గజ బ్యాంకరు కేవీ కామత్‌ అంటున్నారు. పన్ను వివాదాలను వేగంగా పరిష్కరించాలనీ అన్నారు.

Published : 27 May 2023 02:03 IST

ప్రముఖ బ్యాంకరు కేవీ కామత్‌

ముంబయి: దేశంలోని కంపెనీలపై నిబంధనల భారాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని దిగ్గజ బ్యాంకరు కేవీ కామత్‌ అంటున్నారు. పన్ను వివాదాలను వేగంగా పరిష్కరించాలనీ అన్నారు. ప్రస్తుతం నేషనల్‌ బ్యాంక్‌ ఫర్‌ ఫైనాన్సింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ (నాబ్‌ఫిడ్‌)కు ఛైర్మన్‌గా ఉన్న కామత్‌ శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ప్రసంగించారు. ‘నిబంధనల భారం అంశాన్ని ప్రభుత్వం గుర్తించింది. వ్యాపారాలకు పలు ప్రక్రియల్లో సరళీకరణలను తీసుకొచ్చింది. అయితే  అంతర్జాతీయ సెంటిమెంటు ప్రతికూలంగా ఉండడం వల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ) ప్రవాహంపై ప్రతికూల ప్రభావం పడింద’ని అన్నారు. ‘కార్పొరేట్‌ వినియోగ సామర్థ్యం 85 శాతాన్ని అధిగమిస్తే.. ప్రైవేటు మూలధన వ్యయాలు సైతం పెరుగుతాయి. తమ వస్తువులకు గిరాకీ కనిపించేంత వరకు, పెట్టుబడుల నిర్ణయాలను పరిశ్రమ పెద్దలు వాయిదా వేస్తున్నారు. ప్రస్తుతం గిరాకీ ఏమీ స్తబ్దుగా లేదు. ఉక్కు, సిమెంటు వంటి వాటిలో పెట్టుబడులు మొదలయ్యాయి. వృద్ధి ‘వి’ ఆకారంలో ఉందా.. ‘కే’ ఆకారంలో ఉందా అన్నది చెప్పలేను కానీ.. దీర్ఘకాలంలో భారత్‌ వృద్ధి పథంలోనే పయనిస్తుంద’ని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జీడీపీలో డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థ వాటా ప్రస్తుత  6-7 శాతం నుంచి 20 శాతం పైకి చేరుతుందని.. ఇదే వృద్ధికి కీలకంగా మారగలదని ఆయన అంచనా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు