తినుబండారాల విభాగంలోకి రిలయన్స్‌ రిటైల్‌

ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్నాక్స్‌ (తినుబండారాల) విభాగంలోకి రిలయన్స్‌ రిటైల్‌ అడుగుపెడుతోంది.

Published : 27 May 2023 02:03 IST

దేశీయ విపణిలోకి బగుల్స్‌

దిల్లీ: ఎఫ్‌ఎమ్‌సీజీ రంగంలో తన స్థానాన్ని బలోపేతం చేసుకునేందుకు.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న స్నాక్స్‌ (తినుబండారాల) విభాగంలోకి రిలయన్స్‌ రిటైల్‌ అడుగుపెడుతోంది. ఇందుకోసం అమెరికాకు చెందిన బ్రాండెడ్‌ ప్రాసెస్డ్‌ ఆహార పదార్థాల తయారీ సంస్థ జనరల్‌ మిల్స్‌తో రిలయన్స్‌ రిటైల్‌కు అనుబంధంగా ఉన్న రిలయన్స్‌ కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (ఆర్‌సీపీఎల్‌) భాగస్వామ్యం కుదుర్చుకుంది. భారత విపణిలోకి అలన్స్‌ బగుల్స్‌ను విడుదల చేయడం ద్వారా పాశ్చాత్య స్నాక్స్‌ విభాగంలోకి అడుగుపెట్టినట్లు శుక్రవారం రిలయన్స్‌ కన్జూమర్‌ వెల్లడించింది. ‘జనరల్‌ మిల్స్‌కు చెందిన బగుల్స్‌.. 50 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కార్న్‌ చిప్స్‌ స్నాక్స్‌ బ్రాండు. బ్రిటన్‌, అమెరికా, మధ్యప్రాచ్య  విపణుల్లో లభ్యమవుతోంది. ఇప్పుడు మనదేశంలోని వారికీ అందుబాటులోకి రానుంద’ని ఇరు సంస్థలూ పేర్కొన్నాయి. అలన్స్‌ బగుల్స్‌ రూ.10 ప్రారంభ ధరతో ఒరిజనల్‌ (సాల్టెడ్‌), టొమాటో, ఛీజ్‌ రకాల్లో లభ్యం కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని