కొత్త తరం వాహనాలపై దృష్టిపెడతాం: ఫోర్డ్‌

వినియోగదారులను మెప్పిస్తున్న (ఓవర్‌-సర్వ్డ్‌) మార్కెట్‌ విభాగాల్లో పోటీపడటం ఆపేస్తామని, కొత్త తరం వాహనాలు, డిజిటల్‌ సేవలపై దృష్టి పెట్టనున్నట్లు ఫోర్డ్‌ సీఈఓ జిమ్‌ ఫార్లే తెలిపారు.

Published : 28 May 2023 01:35 IST

డియర్‌బార్న్‌ (అమెరికా): వినియోగదారులను మెప్పిస్తున్న (ఓవర్‌-సర్వ్డ్‌) మార్కెట్‌ విభాగాల్లో పోటీపడటం ఆపేస్తామని, కొత్త తరం వాహనాలు, డిజిటల్‌ సేవలపై దృష్టి పెట్టనున్నట్లు ఫోర్డ్‌ సీఈఓ జిమ్‌ ఫార్లే తెలిపారు. ప్రజలందరికీ ఫోర్డ్‌ వస్తువులు అనే రోజులు ముగిశాయని అభిప్రాయపడ్డారు. తక్కువ మార్జిన్‌, బలహీన వృద్ధి, తక్కువ షేరు విలువతో కంపెనీ ఒక శ్రేణిలో ఉండిపోయిందని అన్నారు. సాఫ్ట్‌వేర్‌, సేవలతో పాటు పికప్‌ ట్రక్కులు, పెద్ద ఎస్‌యూవీలు, వాణిజ్య వాహన్చా వంటి దిగ్గజ మోడళ్లు, అధునాతన రెండో తరం విద్యుత్‌ వాహనాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించారు. వ్యయాల నియంత్రణకు ప్రాధాన్యం ఇస్తున్నామని, అన్ని ఫోర్డ్‌ ఫ్యాక్టరీల్లో క్రమశిక్షణ కలిగిన వ్యవస్థలను రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. పట్టు ఉన్న వృద్ధి విభాగాలపై దృష్టి సారించనున్నట్లు ఫోర్డ్‌ బ్లూ అధ్యక్షుడు కుమార్‌ గల్హోత్రా తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు