ప్రైవేట్‌ రంగంలో కొత్త పెట్టుబడుల సంకేతాలు

ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడుల రాక తిరిగి మొదలవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌(సీఈఏ) తెలిపారు.

Published : 28 May 2023 01:36 IST

ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌

దిల్లీ: ప్రైవేట్‌ రంగంలో పెట్టుబడుల రాక తిరిగి మొదలవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌(సీఈఏ) తెలిపారు. ముఖ్యంగా ఉక్కు, సిమెంట్‌ రంగాల్లో కొత్త పెట్టుబడులు చోటుచేసుకోవచ్చని తెలిపారు. మున్ముందు కొత్త పెట్టుబడులపై కొన్ని ప్రకటనలూ వెలువడొచ్చని ఆయన తెలిపారు. గత మూడేళ్లలో తొలి ఆరు నెలలకు లభ్యమవుతున్న గణాంకాల ప్రకారం.. 2020-21లో రూ.2.1 లక్షల కోట్లు; 2021-22లో రూ.2.7 లక్షల కోట్లు; 2022-23లో రూ.3.3 లక్షల కోట్లుగా పెట్టుబడులు నమోదయ్యాయని తెలిపారు. ‘పెట్టుబడులు పెరుగుతున్న విషయాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయి. పూర్తి సంవత్సరానికి గణాంకాలు వచ్చాక.. మరింత స్పష్టత వస్తుంది. కంపెనీలు అంతర్గతంగా నిధులు సమీకరించడం కూడా అధిక స్థాయిల్లోనే ఉంది. అందువల్ల కేపిటల్‌ మార్కెట్లు లేదంటే బ్యాంకుల ద్వారా నిధులు సమీకరించాల్సిన అవసరం వాటికి ఉండకపోవచ్చ’ని అనంత నాగేశ్వరన్‌ వివరించారు. ఉక్కు, సిమెంటు రంగాల్లో సామర్థ్య వినియోగం.. కొత్త పెట్టుబడులు రావాల్సిన స్థాయికి చేరిందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని