కెన్యా చమురు క్షేత్రం కోసం ఓఎన్‌జీసీ-ఆయిల్ ఇండియా చర్చలు
ఓఎన్‌జీసీకి చెందిన విదేశీ విభాగం ఓఎన్‌జీసీ విదేశ్, ఆయిల్ ఇండియా కలిసి కెన్యాకు చెందిన చమురు క్షేత్రం తుల్లో ఆయిల్ పీఎల్‌సీకి చెందిన 3.4 బి. డాలర్ల(దాదాపు రూ.28,000 కోట్లు) చమురు ప్రాజెక్టులో 50 శాతం వాటా కొనుగోలు చేయడం కోసం చర్చలు జరుపుతున్నాయి.
చైనా కంపెనీ రాకతో గట్టి పోటీ
దిల్లీ: ఓఎన్‌జీసీకి చెందిన విదేశీ విభాగం ఓఎన్‌జీసీ విదేశ్, ఆయిల్ ఇండియా కలిసి కెన్యాకు చెందిన చమురు క్షేత్రం తుల్లో ఆయిల్ పీఎల్‌సీకి చెందిన 3.4 బి. డాలర్ల(దాదాపు రూ.28,000 కోట్లు) చమురు ప్రాజెక్టులో 50 శాతం వాటా కొనుగోలు చేయడం కోసం చర్చలు జరుపుతున్నాయి. అంతక్రితం ఇండియన్ ఆయిల్‌తో కలిసి ఓఎన్‌జీసీ విదేశ్ నెలల పాటు ఈ యత్నాలు చేయగా.. తాజాగా కొత్త భాగస్వామి ఆయిల్ ఇండియాతో కలిసి రంగంలోకి దిగింది. అయితే ఇపుడు చైనా ఇంధన దిగ్గజం సినోపెక్‌తో వీరికి గట్టి పోటీ ఎదురుకానుంది. ఒప్పందాన్ని ఖరారు చేసుకోవడంలో భారత్ ఆలస్యం చేస్తుండడంతో చైనా కంపెనీ తెరపైకి వచ్చింది. భారత సంతతికి చెందిన రాహుల్ ధిర్ తుల్లోకు సీఈఓగా ఉన్నారు. కెన్యా ప్రాజెక్టు, రాజస్థాన్‌లోని బామర్ క్షేత్రాల మధ్య చాలా సారూప్యాలున్నందున రాహుల్ కూడా భారత కన్సార్షియం వైపే గతంలో మొగ్గుచూపారు. అయితే ఆ ఆఫ్రికా దేశంపై ఎంచదగ్గరీతిలోనే చైనా ప్రభావం ఉన్నందున ఆ దేశ కంపెనీ రాకతో ఈ ఒప్పందం ఎటు వెళుతుందో తెలియాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్‌లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్
-
Hyderabad: మర్రిగూడ తహసీల్దార్ అరెస్ట్.. అక్రమాస్తులు రూ.4.75 కోట్లు