అరబిందో ఫార్మాకు తగ్గిన లాభాలు
అగ్రశ్రేణి ఔషధ సంస్థల్లో ఒకటైన అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.6,473 కోట్ల ఆదాయాన్ని, రూ.506 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.
ఈనాడు, హైదరాబాద్: అగ్రశ్రేణి ఔషధ సంస్థల్లో ఒకటైన అరబిందో ఫార్మా కన్సాలిడేటెడ్ ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.6,473 కోట్ల ఆదాయాన్ని, రూ.506 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. త్రైమాసిక ఈపీఎస్ రూ.8.64 నమోదైంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఆదాయం రూ.5,809 కోట్లు, నికరలాభం రూ.576 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ నికర లాభం 12% తగ్గినట్లు అవుతోంది. యూఎస్‌లో ఫార్ములేషన్ల ఆదాయం 11.6% పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. ఐరోపా ఆదాయాలు 7.7% పెరిగాయి. పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు రూ.410 కోట్లు వెచ్చించినట్లు పేర్కొంది. యూఎస్‌లో నాలుగు ఇంజక్టబుల్ ఔషధాలు సహా 24 ఔషధాలకు తుది అనుమతులు సంపాదించినట్లు వివరించింది. గత ఆర్థిక సంవత్సరం(2022-23) పూర్తి కాలానికి అరబిందో ఫార్మా రూ.24,855 కోట్ల ఆదాయాన్ని, రూ.1,927 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. వార్షిక ఈపీఎస్ రూ.32.90 ఉంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.23,455 కోట్లు కాగా, దీనిపై రూ.2,647 కోట్ల నికరలాభం రూ.45.19 ఈపీఎస్ ఉన్నాయి. వార్షిక ఆదాయం స్వల్పంగా పెరిగినప్పటికీ, నికరలాభం మాత్రం 27% తగ్గింది. సమీప భవిష్యత్తులో కొత్త ఔషధాలను విడుదల చేయటానికి అధిక ప్రాధాన్యం ఇస్తామని, వ్యాపార సామర్థ్యాన్ని పెంచుకోవటానికి ప్రయత్నిస్తామని అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కె.నిత్యానందరెడ్డి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల