టారోలో మిగిలిన వాటా కొనుగోలు చేస్తాం: సన్‌ ఫార్మా

ఇజ్రాయెల్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న టారో ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేయనున్నట్లు సన్‌ఫార్మా తెలిపింది.

Published : 28 May 2023 01:37 IST

దిల్లీ: ఇజ్రాయెల్‌ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న టారో ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌లో మిగిలిన వాటాను కొనుగోలు చేయనున్నట్లు సన్‌ఫార్మా తెలిపింది. ప్రస్తుతం టారో ఫార్మాస్యూటికల్స్‌లో సన్‌ఫార్మాకు 78.48% వాటా ఉంది. మిగిలిన వాటాకు సంబంధించిన షేర్లను ఒక్కోటి 38 డాలర్లు చొప్పున కొనుగోలు చేసేందుకు ఆసక్తిని కనబరుస్తూ టారో బోర్డుకు సన్‌ఫార్మా లేఖను పంపింది. 2023 మే 26 నాటి టారో షేరు ముగింపు ధర 29.39 డాలర్లతో పోలిస్తే ఇది 31.2 శాతం ఎక్కువ. ప్రతిపాదిత కొనుగోలు లావాదేవీ అనంతరం.. సన్‌ఫార్మాకు టారో పూర్తి స్థాయి అనుబంధ సంస్థగా అవుతుంది. ఎన్‌వైఎస్‌ఈ నుంచి ఆ సంస్థ షేర్లు కూడా తొలగిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు