త్వరలో హైదరాబాద్‌కూ జిప్‌ ఎలక్ట్రిక్‌

హైదరాబాద్‌, ముంబయి, పుణె వంటి నగరాలకూ విస్తరించడం ద్వారా ఈ ఏడాదిలో రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం లక్ష్యమని విద్యుత్తు మొబిలిటీ సేవల అంకుర సంస్థ జిప్‌ ఎలక్ట్రిక్‌ తెలిపింది.

Published : 29 May 2023 02:57 IST

దిల్లీ: హైదరాబాద్‌, ముంబయి, పుణె వంటి నగరాలకూ విస్తరించడం ద్వారా ఈ ఏడాదిలో రూ.500 కోట్ల ఆదాయాన్ని ఆర్జించడం లక్ష్యమని విద్యుత్తు మొబిలిటీ సేవల అంకుర సంస్థ జిప్‌ ఎలక్ట్రిక్‌ తెలిపింది. ప్రస్తుతం సంస్థ 13,500 వాహనాలను నిర్వహిస్తోంది. రాబోయే మూడేళ్లలో 300 మిలియన్‌ డాలర్ల (సుమారు రూ.2500 కోట్ల) పెట్టుబడి పెట్టడం ద్వారా, 2 లక్షల వాహనాలకు చేరాలన్నది తమ ప్రణాళికగా సంస్థ సీఈఓ ఆకాశ్‌ గుప్తా తెలిపారు. దిల్లీ, బెంగళూరు నగరాల్లో ఇ-కామర్స్‌, ఆహార/నిత్యావసరాల డెలివరీ సంస్థలకు ఈ సంస్థ వాహనాలను సమకూరుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని