రాగి దిద్దుబాటు!

పసిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.59,454 కంటే కిందకు వస్తే అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. ఫలితంగా రూ.59,000- 58,730 వరకు దిగి రావచ్చు.

Published : 29 May 2023 03:03 IST

కమొడిటీస్‌ ఈ వారం

పసిడి

సిడి ఆగస్టు కాంట్రాక్టు ఈవారం రూ.59,454 కంటే కిందకు వస్తే అమ్మకాల ఒత్తిడికి లోనుకావచ్చు. ఫలితంగా రూ.59,000- 58,730 వరకు దిగి రావచ్చు. ఒకవేళ రూ.60,401 ఎగువన చలిస్తే రూ.60,822; రూ.61,243 వరకు రాణించొచ్చు.


వెండి

వెండి జులై కాంట్రాక్టు రూ.73,022 స్థాయిని అధిగమిస్తే రూ.73,919 వరకు వెళ్లొచ్చు. ఒకవేళ కిందకు వస్తే రూ.69,794 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయిని కోల్పోతే రూ.68,359 వరకు దిగిరావొచ్చు.


ప్రాథమిక లోహాలు

రాగి జూన్‌ కాంట్రాక్టు రూ.721 కంటే పైన కదలాడకుంటే దిద్దుబాటుకు ఆస్కారం ఉంటుంది. అందువల్ల రూ.723 వద్ద స్టాప్‌లాస్‌ పెట్టుకుని రూ.719; రూ.721 సమీపంలో కాంట్రాక్టును షార్ట్‌ సెల్‌ చేయొచ్చు. ఒకవేళ రూ.721 కంటే పైన కదలాడితే షార్ట్‌ సెల్లింగ్‌కు దూరంగా ఉండాలి.

సీసం జూన్‌ కాంట్రాక్టు రూ.184 దిగువన బలహీనంగా కనిపిస్తోంది. రూ.185.95 ఎగువకు వెళ్తేనే లాంగ్‌ పొజిషన్ల వైపు మొగ్గు చూపాలి.

జింక్‌ జూన్‌ కాంట్రాక్టు రూ.204 కంటే కిందకు రాకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. ఒకవేళ రూ.204 దిగువన చలిస్తే ప్రతికూల ధోరణికి అవకాశం ఉంటుంది.

అల్యూమినియం జూన్‌ కాంట్రాక్టుకు రూ.209 ఎగువన మాత్రమే లాంగ్‌ పొజిషన్లు తీసుకోవాలి. రూ.203 దిగువన కొనుగోళ్లకు దూరంగా ఉండటం మంచిది.


ఇంధన రంగం

ముడి చమురు జూన్‌ కాంట్రాక్టును రూ.5,742 దిగువన షార్ట్‌ సెల్‌ చేయడం మంచిదే. ఒకవేళ రూ.5,854 కంటే కిందకు రాకుంటే రూ.6,171; రూ.6,462 వరకు పెరిగే అవకాశం ఉంటుంది.

సహజ వాయువు జూన్‌ కాంట్రాక్టు రూ.186 దిగువన చలించకుంటే కొనుగోళ్లకు మొగ్గు చూపొచ్చు. అయితే రూ.212 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని అధిగమిస్తే రూ.225 వరకు పెరగొచ్చు. ఒకవేళ రూ.186 దిగువకు వస్తే రూ.173 వరకు పడిపోవచ్చు.


వ్యవసాయ ఉత్పత్తులు

పసుపు జూన్‌ కాంట్రాక్టు రూ.7,626 కంటే పైన కదలాడినంత వరకు లాంగ్‌ పొజిషన్లు అట్టేపెట్టుకోవచ్చు. అయితే రూ.8,311 వద్ద లాభాల స్వీకరణ చోటుచేసుకోవచ్చు. ఒకవేళ ఈ స్థాయినీ అధిగమిస్తే రూ.8,612 వరకు రాణించొచ్చు.

జీలకర్ర జూన్‌ కాంట్రాక్టు కిందకు వస్తే రూ.42,483 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయి కంటే కిందకు వస్తే రూ.41,703 వరకు దిద్దుబాటు కావొచ్చు. ఒకవేళ పైకి వెళితే రూ.45,998 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. ఈ స్థాయిని మించితే రూ.46,977 వరకు పెరగొచ్చు.

పత్తి జూన్‌ కాంట్రాక్టు రూ.57,580 కంటే దిగువన కదలాడితే, మరింత పడిపోవచ్చు.

ఆర్‌ఎల్‌పీ కమొడిటీ అండ్‌ డెరివేటివ్స్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని