చైనా తయారీ విమాన ప్రయాణం షురూ
చైనా సొంతంగా తయారు చేసిన ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం మొదటిసారిగా వాణిజ్య కార్యకలాపాలను విజయవంతంగా పూర్తిచేసింది.
బీజింగ్/షాంఘై: చైనా సొంతంగా తయారు చేసిన ప్రయాణికుల విమానం సీ919 ఆదివారం మొదటిసారిగా వాణిజ్య కార్యకలాపాలను విజయవంతంగా పూర్తిచేసింది. ఫలితంగా పౌర విమానయాన తయారీ విపణిలోకి చైనా అధికారికంగా అడుగుపెట్టింది. బోయింగ్, ఎయిర్‌బస్ వంటి సంస్థలకు పోటీగా సొంతంగా విమానాలను తీసుకురావాలన్న లక్ష్యంలో భాగంగా, చైనా ఈ విమాన తయారీని చేపట్టింది. సీ919తో తొలి వాణిజ్య సర్వీసును షాంఘై నుంచి బీజింగ్ మధ్య ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నడిపింది. 128 మంది ఇందులో ప్రయాణించారు. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో 164 సీట్లు ఉంటాయి. రెండు గంటల ఇరవై అయిదు నిమిషాల్లో ఈ విమానం షాంఘై నుంచి బీజింగ్ చేరుకుంది. బీజింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సీ919 చేరగానే విమానం, సిబ్బంది, ప్రయాణికులకు వాటర్ సెల్యూట్ కార్యక్రమంతో స్వాగతం పలికారు. అంతర్జాతీయ విమాన ప్రమాణాలు, సొంత మేధో సంపత్తి హక్కులతో చైనా సీ919 విమానాన్ని రూపొందించింది. కమర్షియల్ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ చైనా ఈ విమానాన్ని అభివృద్ధి చేయగా.. గత ఏడాది సెప్టెంబరులో సివిల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ చైనా ధ్రువీకరణ పత్రాన్ని మంజూరు చేసింది. ఒకసారి ఇంధనం నింపితే 5,555 కి.మీ దూరం వరకు ప్రయాణించేలా తీర్చిదిద్దిన ఈ విమానంతో.. ఎయిర్‌బస్, బోయింగ్‌లతో పోటీపడాలన్నది చైనా ప్రణాళిక. దేశీయ, ప్రాంతీయ అంతర్జాతీయ విమానాల్లో ఎక్కువగా వినియోగించే ఏ320, బీ737 విమానాలకు సీ919 పోటీదారుగా మారొచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఉత్తరాంధ్ర వాసులకు గుడ్‌న్యూస్.. విశాఖ నుంచి నేరుగా వారణాశికి రైలు
-
Chandrababu Arrest: వచ్చే ఎన్నికల్లో చంద్రసేనకు 160 సీట్లు ఖాయం: అశ్వనీదత్
-
Elon Musk: మస్క్‌ను మలిచిన మూడు పుస్తకాలు.. బయోగ్రఫీలో వెల్లడించిన ప్రపంచ కుబేరుడు
-
Chandrababu Arrest: హైదరాబాద్‌లో ప్రదర్శనలు చేయొద్దంటే ఎలా?: తెదేపా మహిళా నేత జ్యోత్స్న
-
Chandrababu Arrest: ఏపీలో ప్రజాస్వామ్యానికి ప్రమాదఘంటికలు: నారా బ్రాహ్మణి
-
IRCTC: ఐఆర్సీటీసీ ఆఫర్.. విమాన టికెట్లపై ఆ ఛార్జీలు జీరో