ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో మనకు 5వ స్థానం

ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌గా భారత్‌ మళ్లీ అవతరించింది. జనవరిలో ఈ స్థానాన్ని ఫ్రాన్స్‌కు మన దేశం కోల్పోయింది. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడం, దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో ఈ ఏడాది మార్చి 28 నుంచి భారత మార్కెట్లు మళ్లీ దూసుకెళ్తున్నాయి.

Published : 30 May 2023 02:18 IST

ప్రపంచంలో 5వ అతిపెద్ద స్టాక్‌ మార్కెట్‌గా భారత్‌ మళ్లీ అవతరించింది. జనవరిలో ఈ స్థానాన్ని ఫ్రాన్స్‌కు మన దేశం కోల్పోయింది. విదేశీ మదుపర్ల కొనుగోళ్లు స్థిరంగా కొనసాగడం, దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడటంతో ఈ ఏడాది మార్చి 28 నుంచి భారత మార్కెట్లు మళ్లీ దూసుకెళ్తున్నాయి. ఫలితంగా మళ్లీ తొలి విలువ పరంగా 5 స్టాక్‌మార్కెట్ల జాబితాలోకి మనదేశం వచ్చింది. ఈ సమయంలో సెన్సెక్స్‌, నిఫ్టీ దాదాపు 10 శాతం రాణించగా, బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 15%, బీఎస్‌ఈ బ్యాంకింగ్‌ సూచీ 13% లాభాలను పంచాయి. విదేశీ మదుపర్లు గత రెండు నెలల్లో భారత మార్కెట్లలో దాదాపు    6.3 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.52,000 కోట్ల మేర) పెట్టుబడులు పెట్టారు.

* ప్రస్తుతం మన స్టాక్‌ మార్కెట్‌ విలువ 3.4 లక్షల కోట్ల డాలర్లు (రూ.283.92 లక్షల కోట్లు గా ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి భారత మార్కెట్‌ విలువ దాదాపు 330 బి.డాలర్ల (రూ.27 లక్షల కోట్ల)కు పైగా వృద్ధి చెందింది.

* అమెరికా 44.54 లక్షల కోట్ల డాలర్ల (సుమారు రూ.3680 లక్షల కోట్ల) మార్కెట్‌ విలువతో అగ్రస్థానం నిలబెట్టుకుంది. 


రూ.700 కోట్ల సమీకరణలో అల్టిగ్రీన్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్స్‌!

అంబానీ మద్దతున్న ఈవీ కంపెనీ ఇది

దిల్లీ: విద్యుత్‌ సరకు రవాణా వాహనాల తయారీ సంస్థ అల్టిగ్రీన్‌ ప్రొపల్షన్‌ ల్యాబ్స్‌ తాజాగా రూ.700 కోట్ల (85 మి. డాలర్లు) మేర నిధులను సమీకరించాలని భావిస్తోంది. ఉత్పత్తిని పెంచడంతో పాటు కొత్త మోడళ్ల అభివృద్ధిపై పెట్టుబడులు పెట్టడం కోసం ఈ నిధులను కంపెనీ ఉపయోగించనుంది. భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీ మద్దతు ఉన్న ఈ కంపెనీ తాజా నిధుల సమీకరణ కోసం, సంస్థ విలువను 350 మి. డాలర్ల (సుమారు రూ.2900 కోట్ల) దరిదాపుల్లో ఆశిస్తోందని సమాచారం. ఈ సందర్భంలోనే ప్రస్తుత పెట్టుబడిదార్లలో కొంత మంది తమ వాటాలు విక్రయించనున్నట్లు తెలిసింది. చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నందున నిధుల సమీకరణ గణాంకాలు మారొచ్చని చెబుతున్నారు.


 

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని