ప్రభుత్వ కాంట్రాక్టులకూ ‘వివాద్‌ సే విశ్వాస్‌’

ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్టుల్లో వివాదాల పరిష్కారాల కోసం ‘వివాద్‌ సే విశ్వాస్‌-2’ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది.

Published : 30 May 2023 02:11 IST

జులై 15 నుంచి మొదలు
అక్టోబరు 31 వరకు గడువు

దిల్లీ: ప్రభుత్వ సంబంధిత కాంట్రాక్టుల్లో వివాదాల పరిష్కారాల కోసం ‘వివాద్‌ సే విశ్వాస్‌-2’ను ప్రారంభిస్తున్నట్లు ఆర్థిక శాఖ సోమవారం ప్రకటించింది. జులై 15న ఇది ప్రారంభం కానుందని.. కాంట్రాక్టర్లు తమ ఫిర్యాదులను సమర్పించడానికి అక్టోబరు 31 వరకు గడువు ఉంటుందని తెలిపింది. 2023-24 బడ్జెట్‌లో ‘ద వివాద్‌ సే విశ్వాస్‌-2(కాంట్రాక్చువల్‌ డిస్పూట్స్‌)’ను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని కింద వివాదం పరిస్థితిని బట్టి సెటిల్‌మెంట్‌ మొత్తాన్ని కాంట్రాక్టర్లకు ఆఫర్‌ చేస్తారు. వ్యయాల విభాగం ప్రకటించిన పథకం ప్రకారం.. కోర్టు లేదా మధ్యవర్తిత్వ ఆదేశాలు జారీ అయిన పక్షంలో సెటిల్‌మెంట్‌ ఆదేశాల్లో పేర్కొన్న మొత్తంలో వరుసగా 85%, 65% మేర ఉంటుంది. అయితే ముసాయిదా పథకంలో ఇది వరుసగా 80%, 60% చొప్పున మాత్రమే ఉండగా.. తర్వాత వచ్చిన స్పందనల అనంతరం తుది పథకంలో ఆ మేరకు సవరించారు. ఈ పథకం ప్రభుత్వ విభాగాలతో పాటు స్వతంత్ర సంస్థలు, ప్రభుత్వ బ్యాంకులు, మెట్రో, రైల్‌ కార్పొరేషన్‌ వంటి అన్ని సంస్థలకు కూడా వర్తిస్తుంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు