22 శాతం తగ్గిన ఎఫ్‌డీఐ పెట్టుబడులు
గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 22% తగ్గి 46 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.80 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి.
2022-23లో 46 బి.డాలర్లకు పరిమితం
దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో భారత్‌లోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) 22% తగ్గి 46 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.3.80 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయి. 2021-22లో ఎఫ్‌డీఐలు 58.77 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడించాయి. కంప్యూటర్ హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, వాహన రంగాలకు గత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌డీఐ తగ్గాయి. ఈక్విటీతో కలిపి మొత్తం ఎఫ్‌డీఐ పెట్టుబడులు 84.83 బిలియన్ డాలర్ల నుంచి 16% తగ్గి 70.97 బిలియన్ డాలర్లకు చేరాయి.
అగ్రగామి దేశాలు: మన దేశంలోకి వచ్చిన ఎఫ్‌డీఐలో 17.2 బిలియన్ డాలర్లతో సింగపూర్ అగ్రస్థానంలో నిలిచింది. మారిషస్ (6.13 బి.డాలర్లు), అమెరికా (6 బి.డాలర్లు), యూఏఈ (3.35 బి.డాలర్లు), నెదర్లాండ్స్ (2.5 బి.డాలర్లు), జపాన్ (1.8 బి.డాలర్లు), సైప్రస్ (1.27 బి.డాలర్లు), కేమన్ ఐలాండ్ (772 మి.డాలర్లు), జర్మనీ (547 మి.డాలర్లు) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2022-23లో మారిషస్, అమెరికా, నెదర్లాండ్స్, కేమన్ ఐలాండ్స్, జర్మనీ నుంచి ఎఫ్‌డీఐలు తగ్గాయి.
* కంప్యూటర్ సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాలు అత్యధిక పెట్టుబడులను (9.4 బి.డాలర్లు) ఆకర్షించాయి. 2021-22లో ఈ రంగంలోకి 14.5 బి.డాలర్లు వచ్చాయి. వాహన పరిశ్రమలోకి పెట్టుబడులు 7 బి.డాలర్ల నుంచి 1.9 బి.డాలర్లకు పడిపోయాయి. సేవల రంగం (8.7 బి.డాలర్లు), ట్రేడింగ్ (4.8 బి.డాలర్లు), ఔషధ (8.7 బి.డాలర్లు) ర¢సాయనాలు (1.85 బి.డాలర్లు), వాహన పరిశ్రమ (1.27 బి.డాలర్లు), టెలికాం (713 మి.డాలర్లు) ఆకర్షించాయి.
రాష్ట్రాల వారీగా చూస్తే: మహారాష్ట్ర 14.8 బి.డాలర్లు ఆకర్షించింది. 2021-22లో ఈ రాష్ట్రంలోకి 15.44 బి.డాలర్లు వచ్చాయి. కర్ణాటక పెట్టుబడులు 22 బి.డాలర్లు నుంచి 10.42 బి.డాలర్లకు తగ్గిపోయాయి. దిల్లీ, తమిళనాడు, హరియాణా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్‌కు వచ్చిన పెట్టుబడులూ తగ్గాయి. గుజరాత్‌లోకి మాత్రం పెట్టుబడులు 2.7 బి.డాలర్ల నుంచి 4.71 బి.డాలర్లకు పెరిగాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Modi: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పు
-
Asian Games 2023 : అట్టహాసంగా ఆసియా క్రీడలు ప్రారంభం.. ప్రధాని మోదీ స్పెషల్ ట్వీట్!
-
social look: అనుపమ ఉవాచ.. రష్మిక ఫస్ట్‌లుక్.. ఇంకా ఎన్నో ముచ్చట్లు..
-
IND vs AUS: ఆసీస్‌తో రెండో వన్డే.. శ్రేయస్ అయ్యర్‌కు ఇదేనా చివరి ఛాన్స్..?
-
iPhone: ఐఫోన్ డెలివరీ ఆలస్యం.. కోపంతో షాపు ఉద్యోగులనే చితకబాదారు
-
Defamation: కాంగ్రెస్ ఎంపీపై.. అస్సాం సీఎం సతీమణి రూ.10 కోట్లకు దావా!