ప్రభుత్వ సంస్థల కంటే రూ.1 తక్కువకే నయారా ఎనర్జీ పెట్రోల్, డీజిల్
ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విక్రయిస్తున్న ధరల కంటే లీటరుపై రూ.1 తక్కువకే పెట్రోల్, డీజిల్ విక్రయించడాన్ని ప్రైవేట్ రంగ సంస్థ నయారా ఎనర్జీ ప్రారంభించింది.
దిల్లీ: ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విక్రయిస్తున్న ధరల కంటే లీటరుపై రూ.1 తక్కువకే పెట్రోల్, డీజిల్ విక్రయించడాన్ని ప్రైవేట్ రంగ సంస్థ నయారా ఎనర్జీ ప్రారంభించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గినా.. ప్రభుత్వ రంగ ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ పెట్రోల్, డీజిల్ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నాయి. ప్రైవేట్ ఇంధన రిటైల్ కంపెనీలు మాత్రం వినియోగదారులకు ఈ ప్రయోజనాన్ని బదలాయించడం ప్రారంభించాయి. ప్రభుత్వరంగ సంస్థల ధరలతో పోలిస్తే, జూన్ చివరి వరకు తమ రిటైల్ ఔట్‌లెట్‌లలో లీటరుపై రూ.1 తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్ విక్రయిస్తామని నయారా ఎనర్జీ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 86,925 పెట్రోల్ బంకులు ఉండగా.. ఇందులో 7 శాతానికి పైగా నయారా ఎనర్జీవి ఉన్నాయి. మహారాష్ట్ర, రాజస్థాన్ వంటి 10 రాష్ట్రాల్లో ఐఓసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంటే తక్కువ ధరకే పెట్రోల్, డీజిల్‌ను నయారా విక్రయిస్తోంది.
* ఈ నెల ప్రారంభంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, బీపీ పీఎల్‌సీ సంయుక్త సంస్థ జియో-బీపీ ‘ఉన్నత శ్రేణి డీజిల్ ధరను లీటరుపై రూ.1 తగ్గించి విక్రయించడం’ ప్రారంభించింది. ఆ సంస్థ డీజిల్ ధరను మాత్రమే తగ్గించగా, నయారా పెట్రోల్-డీజిల్‌పైనా ధర తగ్గిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!