పిట్టీ ఇంజినీరింగ్‌కు రూ.25 కోట్ల లాభం

పిట్టీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.247.51 కోట్ల ఆదాయాన్ని, రూ.24.83 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది.

Published : 31 May 2023 01:35 IST

ఈనాడు, హైదరాబాద్‌: పిట్టీ ఇంజినీరింగ్‌ లిమిటెడ్‌ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలు నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికానికి రూ.247.51 కోట్ల ఆదాయాన్ని, రూ.24.83 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2021-22 ఇదేకాలంలో ఆదాయం రూ.271.39 కోట్లు, నికరలాభం రూ.19.79 కోట్లు ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరం పూర్తికాలానికి రూ.1,100.17 కోట్ల ఆదాయంపై రూ.58.83 కోట్ల నికరలాభాన్ని సంస్థ నమోదు చేసింది. 2021-22లో ఆదాయం రూ.953.82 కోట్లు, నికరలాభం రూ.51.90 కోట్లు ఉన్నాయి. దీంతో పోల్చితే వార్షికాదాయం 15.34%, నికరలాభం 13.35% పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరంలో 74% ఉత్పత్తి సామర్థ్యాన్ని వినియోగించుకున్నట్లు పిట్టీ ఇంజినీరింగ్‌ వైస్‌ఛైర్మన్‌, ఎండీ అక్షయ్‌ ఎస్‌.పిట్టి వెల్లడించారు. దాదాపు 72,000 టన్నుల షీట్‌ మెటల్‌ సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. వాటాదార్లకు ఒక్కో షేరుకు రూ.1.20 చొప్పున తుది డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు ప్రతిపాదించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని