బైజూస్ విలువ రూ.69,000 కోట్లే!
బెంగళూరు దేశీయ ఎడ్‌టెక్ దిగ్గజ సంస్థ బైజూస్ అంచనా విలువను 62% తగ్గిస్తూ, ఆస్తుల నిర్వహణలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ బ్లాక్‌రాక్ నిర్ణయం తీసుకుంది.
రూ.1.80 లక్షల కోట్ల నుంచి తగ్గించిన బ్లాక్‌రాక్
బెంగళూరు దేశీయ ఎడ్‌టెక్ దిగ్గజ సంస్థ బైజూస్ అంచనా విలువను 62% తగ్గిస్తూ, ఆస్తుల నిర్వహణలో అంతర్జాతీయ అగ్రగామి సంస్థ బ్లాక్‌రాక్ నిర్ణయం తీసుకుంది. బైజూస్‌లో ఈ సంస్థకు మైనారిటీ వాటా (0.7%) ఉంది కూడా. డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే మార్చి త్రైమాసికానికి తన వాటా విలువను 26% మేర బ్లాక్‌రాక్ తగ్గించింది. ఏడాది క్రితంతో పోలిస్తే ఇది 62% క్షీణత. 2022 మార్చిలో బైజూస్‌లో బ్లాక్‌రాక్‌కు కున్న 2279 షేర్ల విలువ 10.7 మిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 4.04 మిలియన్ డాలర్లకు పరిమితమైంది. ఫలితంగా మార్చి ఆఖరుకు బైజూస్ విలువ 8.4 బిలియన్ డాలర్లకు పరిమితం అవుతోంది. ఏడాది క్రితం ఇది 22 బిలియన్ డాలర్లు (సుమారు 1.80 లక్షల కోట్లు)గా ఉంది. లాభాలు ఆర్జించేలా ముందుకు సాగలేకపోవడానికి తోడు 2500 మంది ఉద్యోగులపై బైజూస్ వేటు వేసిన నేపథ్యంలోనే, బ్లాక్‌రాక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆంగ్ల పత్రికలు పేర్కొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Salaar: ‘సలార్’ రిలీజ్ ఆరోజేనా?.. వైరల్‌గా ప్రశాంత్ నీల్ వైఫ్ పోస్ట్
-
IND vs AUS: భారత్‌ను ఓడించిన జట్టు ప్రపంచకప్ గెలుస్తుంది: మైఖేల్ వాన్
-
Prabhas Statue: ప్రభాస్ ‘బాహుబలి’ మైనపు విగ్రహం.. నిర్మాత ఆగ్రహం..!
-
Interpol: ఖలిస్థాన్ ఉగ్రవాది కరణ్‌వీర్‌సింగ్ కోసం ఇంటర్‌పోల్ రెడ్‌కార్నర్ నోటీస్
-
Social Look: చీరలో పూజా మెరుపులు.. రకుల్ పోజులు.. దివి కవిత్వం ఎవరికోసమో తెలుసా..?
-
Black Sea: రష్యాకు ఎదురుదెబ్బ.. నౌకాదళ కమాండర్ సహా 34 మంది మృతి!