పెట్రో రిఫైనరీలు చిన్నవి నిర్మిస్తాం
దేశంలో 450 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక (ఎమ్‌ఎమ్‌టీపీఏ) రిఫైనింగ్ సామర్థ్యాన్ని సాధించడం కోసం, చిన్నపాటి పెట్రోలియం రిఫైనరీలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు
మంత్రి హర్దీప్ సింగ్ పురి
దిల్లీ: దేశంలో 450 మిలియన్ మెట్రిక్ టన్నుల వార్షిక (ఎమ్‌ఎమ్‌టీపీఏ) రిఫైనింగ్ సామర్థ్యాన్ని సాధించడం కోసం, చిన్నపాటి పెట్రోలియం రిఫైనరీలను ఏర్పాటు చేయడంపై దృష్టి సారిస్తున్నట్లు చమురు మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు. మంగళవారమిక్కడ ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ నిర్వహించిన ఎనర్జీ సమిట్‌లో ఆయన మాట్లాడుతూ ‘చిన్న రిఫైనరీలైతే భూసేకరణ, ఇతరత్రా సమస్యలు తక్కువగా ఉంటాయ’ని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని రతనగిరి వద్ద ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌లు 60 ఎమ్‌ఎమ్‌టీపీఏ సామర్థ్యంతో రిఫైనరీ ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలకు అవరోధాలు ఎదురవుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత రిఫైనింగ్ సామర్థ్యం 252 ఎమ్‌ఎమ్‌టీపీఏగా ఉంది. ‘20 ఎమ్‌ఎమ్‌టీపీఏ సామర్థ్యం కలిగిన రిఫైనరీలను ఎక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. 450 ఎమ్‌ఎమ్‌టీపీఏ లక్ష్యాన్ని సాధించడానికి మరికొన్ని విధాన పరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంద’ని ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ నిలిపివేత
-
LGM: ధోనీ సతీమణి నిర్మించిన ‘ఎల్జీఎం’ ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
skanda movie review: రివ్యూ స్కంద.. రామ్-బోయపాటి కాంబినేషన్ మెప్పించిందా?
-
MS Swaminathan: ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
-
ODI WC 2023: ప్రపంచకప్ స్క్వాడ్ ఫైనలయ్యేది నేడే.. ఆ ఒక్కరు ఎవరు?
-
EVs: ఈవీ కొనాలనుకుంటున్నారా? వీటినీ దృష్టిలో పెట్టుకోండి..