1,000 మంది మహిళా ఇంజినీర్లకు ఉద్యోగాలిస్తాం

టాటా టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 మందికి పైగా మహిళా ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Published : 31 May 2023 01:35 IST

లింగ సమానత్వం కోసమే: టాటా టెక్నాలజీస్‌  

దిల్లీ: టాటా టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1,000 మందికి పైగా మహిళా ఇంజినీర్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. తద్వారా తమ సిబ్బందిలో లింగ సమానత్వాన్ని సాధించాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ‘రెయిన్‌బో’ పథకం ద్వారా మరింత మంది మహిళలను తీసుకోవడంపై దృష్టి పెట్టామని, వారు విజయవంతం అయ్యేందుకు తగిన మద్దతు వ్యవస్థలనూ రూపొందించనున్నట్లు తెలిపింది. భవిష్యత్తు మహిళా నాయకులను తయారు చేయడం కోసం ‘లీడర్‌బ్రిడ్జ్‌-వింగ్స్‌’ ప్రోగ్రామ్‌పై దృష్టి పెడుతున్నట్లు వివరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని