పతంజలి ఫుడ్స్‌ లాభం రూ.263 కోట్లు

గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్‌ రూ.263.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234.43 కోటతో పోలిస్తే ఇది 12% అధికం.

Published : 31 May 2023 01:37 IST

దిల్లీ: గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో పతంజలి ఫుడ్స్‌ రూ.263.7 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. 2021-22 ఇదేకాల లాభం రూ.234.43 కోటతో పోలిస్తే ఇది 12% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.6,676.19 కోట్ల నుంచి రూ.7,962.95 కోట్లకు పెరిగింది.

* పూర్తి ఆర్థిక సంవత్సరం (2022-23)లో పతంజలి ఫుడ్స్‌ రూ.886.44 కోట్ల లాభాన్ని నమోదుచేసింది. 2021-22లో ఇది రూ.806.30 కోట్లుగా ఉంది.  ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.24,284.38 కోట్ల నుంచి రూ.31,821.45 కోట్ల నుంచి రూ.31,821.45 కోట్లకు వృద్ధి చెందింది.

* ఎఫ్‌ఎమ్‌సీజీ వ్యాపార ఆదాయం రూ.1,683.23 కోట్ల నుంచి రూ.6,218.08 కోట్లకు దూసుకెళ్లింది. ఎగుమతుల టర్నోవర్‌ రూ.530.80 కోట్లుగా నమోదైంది. గత ఆర్థిక సంవత్సరంలో 6,28,000 హెక్టార్లలో తమ ఉత్పత్తుల సాగు జరిగింది. పామాయిల్‌ పెంపకం 63,816 హెక్టార్లకు పెరిగిందని కంపెనీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, అసోం, అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరాం, నాగాలాండ్‌, త్రిపుర ప్రభుత్వాలతో పతంజలి ఫుడ్స్‌ అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని