కెంట్ నుంచి కుల్ బ్రైస్ శ్రేణి ఫ్యాన్‌లు
వాటర్ ప్యూరిఫైర్ బ్రాండ్‌గా పేరొందిన కెంట్ ఆర్‌ఓ తాజాగా కుల్ బ్రైస్ శ్రేణి ఫ్యాన్‌లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.6999- 10,999 మధ్య ఉన్నాయి.
హైదరాబాద్: వాటర్ ప్యూరిఫైర్ బ్రాండ్‌గా పేరొందిన కెంట్ ఆర్‌ఓ తాజాగా కుల్ బ్రైస్ శ్రేణి ఫ్యాన్‌లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.6999- 10,999 మధ్య ఉన్నాయి. కంపెనీ ఇప్పటికే కుల్ ప్లాటిన్, లక్సస్ సిరీస్ ఫ్యాన్‌లను విక్రయిస్తోంది. అధునాతన డిజైన్, ఫీచర్‌లతో కుల్ బ్రైస్ ఫ్యాన్‌లను రూపొందించినట్లు కెంట్ ఆర్‌ఓ తెలిపింది. ఇందులో వినియోగించిన బీఎల్‌డీసీ టెక్నాలజీతో 65% విద్యుత్ ఆదా అవుతుందని వెల్లడించింది. తక్కువ శబ్దం, వైఫై/ఐఓటీ ఆధారిత వినియోగం, 3 ఏరోడైనమిక్ బ్లేడ్‌లు, అలెక్సా/వాయిస్‌తో పనిచేయడం, రివర్స్ మోడ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయని కంపెనీ వివరించింది. ఏ ఇంటికి అయినా సరికొత్త రూపును ఇవి తెస్తాయని పేర్కొంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు అన్ని అగ్రగామి గృహోపకరణాల స్టోర్‌లలో ఈ ఫ్యాన్‌లు లభిస్తున్నాయని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.