రాంకీ ఇన్‌ఫ్రాకు లాభాల పంట
మౌలిక వసతుల నిర్మాణ రంగ సంస్థ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది.
కలిసొచ్చిన ఓటీఎస్
ఈనాడు, హైదరాబాద్: మౌలిక వసతుల నిర్మాణ రంగ సంస్థ రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏకీకృత ఖాతాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికానికి అత్యంత ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించింది. త్రైమాసిక ఆదాయం రూ.600.99 కోట్లు, పన్నుకు ముందు లాభం రూ.19.49 కోట్లను ఆర్జించింది. కానీ శ్రీనగర్- బనిహల్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్‌కు సంబంధించిన రుణం విషయంలో ఓటీఎస్ (ఏక కాల పరిష్కారం) కుదుర్చుకోవడం వల్ల కలిగిన రూ.1294 కోట్ల అసాధారణ లాభంతో, మార్చి త్రైమాసికానికి రూ.1077.68 కోట్ల నికరలాభం నమోదైంది. త్రైమాసిక ఈపీఎస్ రూ.155.65 ఉంది. 2021-22 ఇదే కాలంలో రూ.610.41 కోట్ల ఆదాయంపై రూ.46.63 కోట్ల నికర నష్టాన్ని సంస్థ నమోదు చేసింది.
* గత ఆర్థిక సంవత్సరం పూర్తి కాలానికి రాంకీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రూ.1,866.56 కోట్ల ఆదాయాన్ని, రూ.1152.07 కోట్ల నికరలాభాన్ని, రూ.164.83 ఈపీఎస్‌ను నమోదు చేసింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ.1780.73 కోట్లు, నికరలాభం రూ.42.31 కోట్లు, ఈపీఎస్ రూ.3.41 ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: ‘ఐటీని తెలుగువారికి పరిచయం చేయడమే చంద్రబాబు నేరమా?’
-
పార్కులో జంటను బెదిరించి.. యువతిపై పోలీసుల లైంగిక వేధింపులు
-
Diabetes: టైప్-1 మధుమేహానికి వ్యాక్సిన్
-
Chandrababu: చంద్రబాబు పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
-
Nizamabad: మాల్లో ఫ్రిజ్ తెరవబోయి విద్యుదాఘాతంతో చిన్నారి మృతి
-
Bandaru: గుంటూరు నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌కు మాజీ మంత్రి బండారు