వినియోగదార్ల అనుమతి లేకుండా ఫోన్ నంబరు తీసుకోవద్దు
వస్తువులు లేదా సేవల విక్రయం సమయంలో వినియోగదార్ల అనుమతులు లేకుండా వారి ఫోన్ నంబరు తీసుకోరాదని రిటైలర్లకు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సూచించారు.
రిటైలర్లకు చెప్పండి
పరిశ్రమ సంఘాలకు కేంద్రం లేఖ
దిల్లీ: వస్తువులు లేదా సేవల విక్రయం సమయంలో వినియోగదార్ల అనుమతులు లేకుండా వారి ఫోన్ నంబరు తీసుకోరాదని రిటైలర్లకు వినియోగదారు వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ సూచించారు. ఈ విషయాన్ని వ్యాపార/వాణిజ్య సంస్థలకు వివరించాలంటూ సీఐఐ, ఫిక్కీ, అసోచామ్, పీహెచ్‌డీసీసీఐ, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఆర్‌ఏఐ), కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (కెయిట్)లకు లేఖ రాశారు. విక్రయాలకు ఫోన్ నంబరును తప్పనిసరి చేయరాదని స్పష్టం చేశారు. ఏవైనా ఉత్పత్తులను కొనుగోలు చేసే సమయంలో, ఫోన్ నంబరు ఇవ్వాలంటూ వినియోగదార్లను పలు రిటైల్ సంస్థలు ఒత్తిడి చేస్తున్నాయంటూ నేషనల్ కన్జూమర్ హెల్ప్‌లైన్ (ఎన్‌సీహెచ్)కు పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. ఫోన్ నంబరు ఇవ్వకపోతే ఉత్పత్తి లేదా సేవల విక్రయానికి నిరాకరించడం లేదంటే రిఫండ్/మార్పిడికి అంగీకరించడం లేదని.. ఇది కన్జూమర్ ప్రొటెక్షన్ యాక్ట్-2019 కింద హక్కుల ఉల్లంఘనే అని తెలిపారు. ఫోన్ నంబరు / వ్యక్తిగత సమాచారం ఇచ్చిన వారికి.. రిటైలర్ల నుంచి మార్కెటింగ్, ప్రచార సందేశాలు వెల్లువెత్తుతున్నాయని తమ దృష్టికి వచ్చినట్లు రోహిత్ తెలిపారు. ఈ పరిస్థితులపై వినియోగదార్ల వ్యవహారాల విభాగం ఆందోళన చెందుతున్నట్లు ఆయన తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.