అదానీ పోర్ట్స్‌ లాభం రూ.1141 కోట్లు

అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) మార్చి త్రైమాసికానికి రూ.1140.97 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది.

Published : 31 May 2023 01:35 IST

దిల్లీ: అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనామిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజడ్‌) మార్చి త్రైమాసికానికి రూ.1140.97 కోట్ల ఏకీకృత నికరలాభాన్ని నమోదు చేసింది. 2021-22 ఇదేకాల లాభం రూ.1111.63 కోట్ల కంటే ఇది 2.63% ఎక్కువ. ఇదే సమయంలో ఆదాయం రూ.4739.08 కోట్ల నుంచి రూ.6179.12 కోట్లకు పెరిగింది. వ్యయాలు కూడా రూ.3497.49 కోట్ల నుంచి రూ.3993.62 కోట్లకు చేరాయి. ప్రతి షేరుకు రూ.5 చొప్పున డివిడెండ్‌ ఇవ్వాలని సంస్థ బోర్డు ప్రతిపాదించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని