మరోసారి తాత అయిన ముకేశ్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ముకేశ్ పెద్ద కుమారుడు, జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా అంబానీలకు బుధవారం రెండో సంతానంగా ఆడపిల్ల జన్మించింది.
దిల్లీ: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ మరోసారి తాత అయ్యారు. ముకేశ్ పెద్ద కుమారుడు, జియో ఛైర్మన్ ఆకాశ్ అంబానీ, కోడలు శ్లోకా మెహతా అంబానీలకు బుధవారం రెండో సంతానంగా ఆడపిల్ల జన్మించింది. అంబానీ కుటుంబ స్నేహితుడైన ధన్‌రాజ్ నాథ్వానీ ఈ విషయాన్ని ట్విటర్‌లో వెల్లడించారు. ‘ఆకాశ్, శ్లోకా అంబానీకి హృదయపూర్వక అభినందనలు. వారి జీవితంలోకి యువరాణి ఆగమనం సంతోషకరం. ఈ శుభపరిణామంతో మీ జీవితాల్లో మరింత సంతోషం, ప్రేమ నిండాలని కోరుకుంటున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. ఆకాశ్ దంపతులకు కుమారుడు ‘పృథ్వి’ 2020 డిసెంబరులో జన్మించగా.. ఇపుడు కుమార్తె పుట్టింది. గతేడాది నవంబరులో ఆకాశ్ కవల సోదరి ఈశా, ఆమె భర్త ఆనంద్ పిరమాల్ కవలల(కృష్ణ, ఆదియ)కు జన్మనిచ్చిన విషయం విదితమే.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Chandrababu: చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంలో విచారణ ప్రారంభం
-
Nitin Gadkari : హైడ్రోజన్ బస్సులో ప్రయాణించిన నితిన్ గడ్కరీ
-
Narayana: మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా
-
Delhi: బైక్ దొంగల వెనుక ఉగ్ర నెట్వర్క్.. ఆ టెర్రరిస్టులందరూ ఇంజినీర్లే..!
-
Angallu case: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరణ