ఇమ్యునోయాక్ట్‌లో లారస్‌ ల్యాబ్స్‌కు 34% వాటా

సెల్‌, జీన్‌ థెరపీ ఉత్పత్తుల సంస్థ ఇమ్యునోఅడాప్టివ్‌ సెల్‌ థెరపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇమ్యునోయాక్ట్‌) లో, లారస్‌ ల్యాబ్స్‌ తన వాటా పెంచుకుంటోంది.

Published : 01 Jun 2023 02:29 IST

ఈనాడు, హైదరాబాద్‌: సెల్‌, జీన్‌ థెరపీ ఉత్పత్తుల సంస్థ ఇమ్యునోఅడాప్టివ్‌ సెల్‌ థెరపీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (ఇమ్యునోయాక్ట్‌) లో, లారస్‌ ల్యాబ్స్‌ తన వాటా పెంచుకుంటోంది. ఇప్పటికే దాదాపు 26% వాటా కలిగిన లారస్‌ ల్యాబ్స్‌, మరో 7.24% వాటాను రూ.80 కోట్లతో కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో ఇమ్యునోయాక్ట్‌లో లారస్‌ ల్యాబ్స్‌ వాటా 33.86 శాతానికి పెరుగుతుంది. తాము అందించే నిధులతో సెల్‌, జీన్‌ థెరపీ సాంకేతిక పరిజ్ఞానం ఆధారిత చికిత్సలను ఇమ్యునోయాక్ట్‌ అందుబాటులోకి తీసుకురాగలుగుతుందని లారస్‌ ల్యాబ్స్‌ సీఈఓ సత్యనారాయణ చావ వివరించారు. ఇప్పటికే తాము జీఎంపీ ప్రమాణాలతో ఔషధాల తయారీ యూనిట్‌ను, ఆర్‌అండ్‌డీ కేంద్రాన్ని సిద్ధం చేసినట్లు ఇమ్యునోయాక్ట్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ రాహుల్‌ పుర్వార్‌ పేర్కొన్నారు. ముందుముందు కార్‌-టీ టెక్నాలజీ చికిత్సలను రోగులకు పెద్దఎత్తున అందుబాటులోకి తీసుకు వస్తామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని