కోల్ ఇండియాలో 3% వాటా విక్రయం
కోల్ ఇండియాలో ప్రభుత్వం 3% వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిలో నేటి నుంచి విక్రయించనుంది. ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.225ను నిర్ణయించింది.
దిల్లీ: కోల్ ఇండియాలో ప్రభుత్వం 3% వరకు వాటాను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) పద్ధతిలో నేటి నుంచి విక్రయించనుంది. ఒక్కో షేరుకు కనీస ధరగా రూ.225ను నిర్ణయించింది. బీఎస్‌ఈలో బుధవారం షేరు ముగింపు ధర రూ.241.20తో పోలిస్తే కనీస ధర 6.7 శాతం తక్కువ కావడం గమనార్హం. కనీస ధర లెక్కన 3% వాటా విక్రయం ద్వారా ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.4,158 కోట్లు చేరే అవకాశం ఉంది. జూన్ 1, 2 తేదీల్లో రిటైల్, నాన్-రిటైల్ మదుపర్లు ఈ షేర్లు కొనుగోలు చేయొచ్చు. కోల్ ఇండియాలో 1.5 శాతానికి సమానమైన 9.24 కోట్ల షేర్లను ప్రభుత్వం విక్రయించాలని చూస్తోంది. అధిక స్పందన లభిస్తే.. మరో 1.5% షేర్లను విక్రయించనున్నట్లు ఎక్స్ఛేంజీలకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్
-
HCA: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Social Look: సమంత సైకిల్ రైడ్.. దేవకన్యలా ప్రియాంక.. రెడ్ డ్రెస్లో అనన్య
-
ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి..! ‘ఆదిత్య ఎల్1’పై ఇస్రో కీలక అప్డేట్