సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాల్లో ఉచితంగా వైఫై

తమ విమానాల్లో అన్ని తరగతుల ప్రయాణికులకు ఉచితంగా, అపరిమిత వైఫై సదుపాయాన్ని జులై 1 నుంచి కల్పించనున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

Updated : 01 Jun 2023 06:42 IST

దిల్లీ: తమ విమానాల్లో అన్ని తరగతుల ప్రయాణికులకు ఉచితంగా, అపరిమిత వైఫై సదుపాయాన్ని జులై 1 నుంచి కల్పించనున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. తమ విమానాలన్నింటిలో, అంతర్జాతీయంగా దాదాపు అన్ని మార్గాల్లో ఈ సదుపాయం కల్పిస్తామని సంస్థ బుధవారం తెలిపింది. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు మన దేశం కూడా కీలక విపణే. ఇక్కడి 8 నగరాలకు వారానికి 96 సర్వీసులను సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ నిర్వహిస్తోంది. ఎకానమీ, ప్రీమియం ఎకానమీ తరగతుల ప్రయాణికులు కూడా అపరిమిత వైఫైని ఆస్వాదిస్తూ ప్రయాణించొచ్చని సంస్థ పేర్కొంది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని