మెజ్లానిక్‌ క్లౌడ్‌ వ్యవసాయ డ్రోన్లు

వ్యవసాయం, సరకు రవాణా సేవలకు ఉపయోగపడే డ్రోన్లను ఆవిష్కరించినట్లు, హైదరాబాద్‌కు చెందిన మెజ్లానిక్‌ క్లౌడ్‌ సీఈఓ సుధీర్‌ రెడ్డి తుమ్మ ఇక్కడ తెలిపారు.

Published : 01 Jun 2023 02:35 IST

హైదరాబాద్‌ (రాయదుర్గం), న్యూస్‌టుడే: వ్యవసాయం, సరకు రవాణా సేవలకు ఉపయోగపడే డ్రోన్లను ఆవిష్కరించినట్లు, హైదరాబాద్‌కు చెందిన మెజ్లానిక్‌ క్లౌడ్‌ సీఈఓ సుధీర్‌ రెడ్డి తుమ్మ ఇక్కడ తెలిపారు. సరకులను చేరవేసే డ్రోన్లు 2-100 కిలోల బరువును మోస్తాయని, 5-60 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని పేర్కొన్నారు. 200 కిలో మీటర్ల వరకూ వెళ్లగలిగే డ్రోన్లను తయారు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో క్రిమిసంహారకాలను పిచికారీ చేసేందుకు వీలైన డ్రోన్లనూ తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. తమ డ్రోన్లు రూ.4-50 లక్షల శ్రేణిలో ఉంటాయన్నారు. వీడియో ఆధారిత నిఘా డ్రోన్ల విభాగంలో అగ్రగామిగా మారాలన్నది లక్ష్యమన్నారు.  1,200 మంది ఉద్యోగులున్న తమ సంస్థ ఫార్చూన్‌ 500 కంపెనీలకు ఐటీ, ఐటీఈఎస్‌, డిజిటల్‌ టెక్నాలజీ తదితర సేవలనూ అందిస్తున్నట్లు సీఎఫ్‌ఓ సంజయ్‌ చౌహాన్‌ తెలిపారు.

పెరిగిన నికర లాభం: మార్చి త్రైమాసికంలో మెజ్లానిక్‌ క్లౌడ్‌ ఏకీకృత ఖాతాల ప్రకారం రూ.57.91 కోట్ల ఆదాయాన్ని, రూ.18 కోట్ల నికర లాభాన్నీ ఆర్జించింది. 2021-22 ఇదే కాలంలో  రూ.66.62 కోట్ల ఆదాయంపై, రూ.1.58 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. పూర్థి ఆర్థిక సంవత్సరానికి రూ.387.50 కోట్ల ఆదాయంపై రూ.74.10 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు