అత్యుత్తమ భారత బ్రాండ్‌ టీసీఎస్‌.. తరవాత స్థానాల్లో రిలయన్స్‌, ఇన్ఫోసిస్‌

అత్యంత విలువైన భారత బ్రాండ్‌గా ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిలిచింది. అత్యుత్తమ 50 బ్రాండ్‌లతో ఈ జాబితాను ఇంటర్‌బ్రాండ్‌ సంస్థ విడుదల చేసింది.

Published : 01 Jun 2023 06:46 IST

50 సంస్థలతో ఇంటర్‌బ్రాండ్‌ జాబితా

దిల్లీ: అత్యంత విలువైన భారత బ్రాండ్‌గా ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) నిలిచింది. అత్యుత్తమ 50 బ్రాండ్‌లతో ఈ జాబితాను ఇంటర్‌బ్రాండ్‌ సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో రూ.1,09,576 కోట్ల బ్రాండ్‌ విలువతో టీసీఎస్‌ అగ్రస్థానంలో నిలిచింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ (రూ.65,320 కోట్లు), ఇన్ఫోసిస్‌ (రూ.53,324) రెండు, మూడు స్థానాలు దక్కించుకున్నాయి.

* గత దశాబ్ద కాలంలో ఇతర రంగాలను అధిగమించి టెక్నాలజీ రంగం అగ్రస్థానంలో నిలిచింది. అగ్రగామి 5 బ్రాండ్‌లలో 3 స్థానాలను టెక్నాలజీ కంపెనీలే సాధించాయి. ఆర్థిక సేవల రంగం నుంచి 9 సంస్థలు జాబితాలో చోటు పొందాయి. హోమ్‌ బిల్డింగ్‌, ఇన్‌ఫ్రా రంగం నుంచి 7 కంపెనీలు ఈ జాబితాలో స్థానం సంపాదించాయి.

* గత పదేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధిస్తున్న రంగాల్లో ఎఫ్‌ఎమ్‌సీజీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ రంగం 25 శాతం వార్షిక సమ్మిళిత వృద్ధి రేటు (సీఏజీఆర్‌) నమోదుచేస్తోంది. హోమ్‌ బిల్డింగ్‌, ఇన్‌ఫ్రా (17 శాతం), టెక్నాలజీ (14 శాతం) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. హోమ్‌ బిల్డింగ్‌, ఇన్‌ఫ్రా రంగం రూ.6900 కోట్ల నుంచి రూ.34,400 కోట్లకు వృద్ధి చెందగా, టెక్నాలజీ రూ.69,300 కోట్ల నుంచి రూ.2.5 లక్షల కోట్లకు దూసుకెళ్లింది.

* అగ్రగామి 10 బ్రాండ్‌ల మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్‌ల వాటా 46 శాతంగా ఉంది. మొత్తం జాబితాలో అగ్రగామి 5 బ్రాండ్‌ల వాటా 40 శాతంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని